Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు

అంతర్జాతీయంతాజా వార్తలు

Bahrain Protests | బహ్రెయిన్​లో చెలరేగిన అల్లర్లు

బహ్రెయిన్​లో అల్లర్లు చెలరేగాయి. ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ హత్యకు నిరసనగా షియా ముస్లింలు నిరసన చేపట్టారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 3, 2026 10:29 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 వారాలు ago
Share
Bahrain Protests
Bahrain Protests

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bahrain Protests | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్​పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్​ ఖమేనీ (Supreme Leader Khamenei) మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్​ దాడులు చేస్తోంది.

Contents
  • Bahrain Protests| దుబాయిలో హోటల్​పై దాడి
    • Bahrain Protests | సూపర్​మార్కెట్లు ఖాళీ

ఇజ్రాయెల్​తో పాటు గల్ఫ్​ దేశాలు యూఏఈ, సౌదీ, ఖతార్​, బహ్రెయిన్​లోని యూఎస్​ సైనిక స్థావరాలపై ఇరాన్​ పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తుంది. ఈ క్రమంలో బహ్రెయిన్​లో అల్లర్లు చెలరేగాయి. ఓ వైపు ఇరాన్​ బహ్రెయిన్​పై దాడులు చేస్తుండగా.. మరోవైపు ఆ దేశానికి మద్దతుగా షియా ముస్లింలు (Shia Muslims) రోడ్డెక్కి నిరసన చేపడుతున్నారు. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఖమేనీ హత్యకు నిరసనగా ఆందోళన చేస్తున్నారు. నిరసనకారులు పెట్రోలు బాంబులు విసురుతుండటంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై బెహ్రయిన్ పోలీసుల లాఠీచార్జ్, కాల్పులు జరిపారు.

Bahrain Protests| దుబాయిలో హోటల్​పై దాడి

దుబాయ్‌ (Dubai)లోని అమెరికన్ సైనిక సిబ్బంది బస చేసిన హోటల్‌పై షాహెద్ 136 డ్రోన్‌తో ఇరాన్ దాడి చేసింది. రియాద్‌లోని యూఎస్ ఎంబసీ (US Embassy)పై హైపర్​ సోనిక్​ క్షిపణిని ప్రయోగించింది. మరోవైపు ఇరాన్​పై ఇజ్రాయెల్​ సైతం దాడులకు దిగింది. టెహ్రాన్‌లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ IRIB ప్రధాన కార్యాలయం దాడిలో ధ్వంసం అయింది. దీంతో ఇరాన్​ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ (Israel)పై 11వ విడత క్షిపణి దాడులు చేసింది.

Bahrain Protests | సూపర్​మార్కెట్లు ఖాళీ

ఇరాన్​ దాడులతో దుబాయి అల్లాడుతోంది. ఇప్పటికే ఎయిర్​పోర్టులు మూసివేయడంతో అనేక మంది అక్కడ చిక్కుకుపోయారు. మరోవైపు దాడులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. దీంతో దుబాయ్‌లో సూపర్ మార్కెట్లు (Super Markets) ఖాళీ అవుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్లడం లేదు. దీంతో రోడ్లు సైతం ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.

ఇది కూడా చదవండి..: Gulf Iran Tensions | గల్ఫ్‌ దేశాల నేతలతో ప్రధాని మోదీ చర్చలు

Anjali Sardana Startup | ఏడాదిలోనే రూ.800 కోట్ల టర్నోవర్​.. స్టార్టప్​తో యువతి విజయం
Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!
Trump Tariff Refund | ట్రంప్​కు షాక్​.. టారిఫ్​ డబ్బులు రిటన్​ ఇచ్చేయాలన్న కోర్టు
March 21 Gold Rates | పసిడి ధరలకు బ్రేక్… ఒక్కసారిగా భారీ పతనం, కొనుగోలుదారులకు ఊరట!
Gold Silver Rates | ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం .. పెళ్లిళ్ల సీజన్లో పరుగులు పెడుతున్న ప‌సిడి
TAGGED:DubaiIsraelShia MuslimsSuper MarketsSupreme Leader KhameneiUS Embassy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article IPF UAE 24x7 Help | ఇండియన్ పీపుల్స్ ఫోరం – యూఏఈ | 24×7 కమ్యూనిటీ హెల్ప్ లైన్​ సర్వీస్​ IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
Next Article T20 World Cup 2026 Semifinal Rain T20 World Cup 2026 Semifinal Rain | సెమీఫైనల్స్‌కి వర్షం ముప్పు ఉందా.. మ్యాచ్ రద్దైతే ఫైనల్‌కి ఎవరు?
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?