అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balakrishna Lifetime Achievement | టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. గత 50 ఏళ్లుగా భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు ఢిల్లీలో (Delhi) జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026 వేడుకల్లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ (Lifetime Achievement) అవార్డును అందజేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ పురస్కారం స్వీకరించారు.
ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రోత్సవం ‘భారత్ మండపం’ వేదికగా జరుగుతోంది. ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. వివిధ భాషలకు చెందిన చిత్రాలను ప్రదర్శిస్తూ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
Balakrishna Lifetime Achievement | సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ..
ఈ కార్యక్రమాన్ని సీఎం రేఖా గుప్తాతో (CM Rekha Gupta) పాటు పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ వేడుకలో హేమ మాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ పాల్గొన్నారు. అలాగే దివంగత నటుడు ధర్మేంద్రను కూడా జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించడం విశేషం. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. డైలాగ్ డెలివరీ, యాక్షన్, మాస్ ఇమేజ్‌తో టాలీవుడ్‌లో (Tollywood) అగ్ర హీరోగా ఎదిగారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లకు పైగా కెరీర్ పూర్తి చేయడం ఆయన గొప్ప సాధనగా చెప్పుకోవచ్చు.
Balakrishna Lifetime Achievement | ఆయన సేవలకు గుర్తుగా..
సినీరంగంతో పాటు ప్రజాసేవలో కూడా బాలకృష్ణ తన ముద్ర వేశారు. ప్రస్తుతం హిందూపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. పేదలకు వైద్య సహాయం అందిస్తూ తన సేవాభావాన్ని చాటుతున్నారు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడమే కాకుండా, తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, 60 దాటిన వయసులోనూ బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా, ఇటీవల వచ్చిన ‘అఖండ 2: తాండవం’ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ‘NBK 111’ చిత్రంలో నటిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Dhurandhar Box Office | బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్: ది రివెంజ్.. 3 రోజుల్లోనే రూ.448 కోట్లు!

