అక్షరటుడే, హైదరాబాద్: Balka Suman Bail | తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన కేసులో భారాస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో పాటు నిర్దిష్ట నిబంధనలను పాటించాలనే షరతులతో సోమవారం సాయంత్రం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
Balka Suman Bail | షరతులతో కూడిన..
ఇటీవల క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఘర్షణల నేపథ్యంలో నమోదైంది. ఈ కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను రిమాండ్‌కు పంపడంతో.. గత 15 రోజులుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉండిపోయారు.
కాగా, సోమవారం ఉదయం పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు వాయిదా వేసింది. అనంతరం బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టి, సాయంత్రం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం విచారణకు సహకరించాలని ఆదేశించింది. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని సూచించింది.
Balka Suman Bail |
బెయిల్ మంజూరైన విషయం తెలిసిన వెంటనే భారాస నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సమయంలో పలువురు భారాస పార్టీ నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు.
బాల్క సుమన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఇకపై కేసు దర్యాప్తు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నెలకొంది.

