అక్షరటుడే, వెబ్డెస్క్ : Bamrukn Ud Daula Lake | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పాతబస్తీలో గల చారిత్రక బమృకున్ – ఉద్ – దౌలా చెరువు ప్రారంభానికి సిద్ధమైంది. హైడ్రా ఆధ్వర్యంంలో పలు చెరువులను పునరుద్ధరించిన విషయం తెలిసిందే. గతంలో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చిన హైడ్రా.. ప్రస్తుతం పలు చెరువులను పునరుద్ధరిస్తోంది.
ఓల్డ్ సిటీ (Old City)లోని బమృకున్ – ఉద్ – దౌలా చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువు (Nalla Cheruvu) పనులు పూర్తయ్యాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బమృకున్ – ఉద్ – దౌలా చెరువును ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్రారంభ కార్యక్రమం అనంతరం జరగున్న సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట హైడ్రా అదనపు కమిషనర్ సుదర్శన్, ఏసీపీలు తిరుమల్, ఉమామహేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Bamrukn Ud Daula Lake | ఆక్రమణలు తొలగించి..
ఆక్రమణలతో కుచించుకుపోయి 4.20 ఎకరాలకు పరిమితమై మురికి కూపంగా ఉన్న చెరువును దాదాపు 18 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. స్థానికులను ఒప్పించి, ఆక్రమణలను తొలగించి చెరువుకు పూర్వ వైభవం తెచ్చింది. పూడికను తీయడంతో పాటు మురుగు నీరు కలవకుండా చర్యలు చేపట్టింది.
Bamrukn Ud Daula Lake | స్థానికుల హర్షం
ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు తాము చెరువును ఇంత బాగా పునరుద్ధరిస్తారని ఊహించలేదని స్థానికులు అన్నారు. ఇప్పుడు చెరువును చూస్తే ముచ్చటగా ఉందన్నారు. బమృకున్ – ఉద్ – దౌలా చెరువును ఆనుకుని ఉన్న కాలనీ వాసులు హైడ్రా (Hydraa)కు కృతజ్ఞతలు తెలిపారు. చెరువు చుట్టూ నడక దారి, పార్కులు, పిల్లల ఆటస్థలం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కాగా కూకట్‌పల్లి నల్ల చెరువును సైతం హైడ్రా పునరుద్ధరించింది. దీనిని సీఎం రేవంత్రెడ్డి సోమవారం ప్రారంభించనున్నట్లు సమాచారం.


