Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

లైఫ్​స్టైల్​ - Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!

లైఫ్​స్టైల్​తాజా వార్తలు

Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!

అరటిపండు తిన్న తర్వాత తొక్కను రోడ్డుపై పడేయకండి. చిన్న పొరపాటు ఇతరుల ఆరోగ్యానికి చేటు కలిగించవచ్చు. ఎప్పుడూ చెత్తను డస్ట్‌బిన్‌లోనే వేయడం అలవాటు చేసుకోండి.

Naresh chandan
Last updated: మార్చి 25, 2026 6:26 సా.
Naresh chandan
16 గంటలు ago
Share
Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Banana Peel | సాధారణంగా దారిలో వెళ్లేటప్పుడు ఏదైనా పండు తొక్క కనిపిస్తే మనం పెద్దగా పట్టించుకోం. కానీ అదే అరటి తొక్క అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే దానిపై కాలు వేస్తే క్షణాల్లో కింద పడిపోతాం. ఆపిల్ లేదా నారింజ వంటి ఇతర పండ్ల తొక్కల కంటే అరటి తొక్కకు అంత జారుడు గుణం ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న వింతైన శాస్త్రీయ కారణాన్ని జపాన్ పరిశోధకులు గుర్తించారు.

Contents
  • Banana Peel | ఆ సూక్ష్మ సంచులే అసలు కారణం:
    • Banana Peel | ఆ జెల్​
      • నియంత్రణ కోల్పోయే మెదడు:
      • పరిశోధనకు దక్కిన గౌరవం:

Banana Peel | ఆ సూక్ష్మ సంచులే అసలు కారణం:

మనం అరటి తొక్కను పైకి చూసినప్పుడు అది పొడిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ దాని లోపల వేల సంఖ్యలో ‘పాలీశాకరైడ్’ అనే జిగురు పదార్థంతో నిండిన చిన్న చిన్న సంచులు ఉంటాయి. మనం దానిపై అడుగు పెట్టగానే మన శరీర బరువుకు ఆ సంచులు ఒక్కసారిగా పగిలిపోతాయి. వెంటనే వాటి నుంచి ఒక రకమైన జెల్ బయటకు వస్తుంది. ఇది షూకు , నేలకు మధ్య ఒక లూబ్రికెంట్‌లా మారి ఘర్షణను పూర్తిగా తగ్గించేస్తుంది.

Banana Peel | ఆ జెల్​

మనం రోడ్డుపై నడవాలంటే కాళ్లకు, నేలకు మధ్య కొంత ఘర్షణ (Friction) ఉండాలి. కానీ అరటి తొక్క ఈ ఘర్షణను దాదాపు సున్నా స్థాయికి తీసుకువస్తుంది. సైన్స్ ప్రకారం అరటి తొక్క ఘర్షణ విలువ కేవలం 0.07 మాత్రమే. ఇది బురద లేదా మంచు గడ్డ కంటే కూడా చాలా తక్కువ. ఆపిల్ తొక్కలో ఇలాంటి ప్రత్యేకమైన జెల్ ఉండదు కాబట్టే అది అరటి తొక్క అంత ప్రమాదకరంగా మారదు.

నియంత్రణ కోల్పోయే మెదడు:

నడిచేటప్పుడు మన శరీరాన్ని సమతుల్యం చేసే బాధ్యత మెదడుది. అయితే అరటి తొక్కపై కాలు వేయగానే, ఆ జెల్ కారణంగా కాలు ఊహించని వేగంతో ముందుకు జారిపోతుంది. ఈ ఆకస్మిక మార్పును మన మెదడు వెంటనే గుర్తించి శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతుంది. ఫలితంగా సెకన్ల వ్యవధిలో నియంత్రణ కోల్పోయి మనం వెల్లకిలా పడిపోతాము. దీనివల్ల కలిగే గాయం చాలా తీవ్రంగా ఉంటుంది.

పరిశోధనకు దక్కిన గౌరవం:

ఈ వింత అంశంపై లోతుగా రీసెర్చ్ చేసినందుకు గాను జపాన్ శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకమైన ‘ఇగ్ నోబెల్’ అవార్డు దక్కింది. కేవలం అరటి తొక్కలోనే ఉండే ఈ ప్రత్యేకమైన గుణం సైన్స్ ప్రపంచంలో ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి: Diabetes Toothpaste Safety | షుగర్ పేషంట్లు తియ్యగా ఉండే పేస్ట్‌లు వాడొచ్చా? వాడితే ఏమౌతుంది?

Sadabainama Application | మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. త్వరలో ‘సాదాబైనామా’ దరఖాస్తుల పరిష్కారం..
March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
High Protein Breakfast | గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ వీటిలోనే..అవి ఏంటో తెలుసా!
Kalvakuntla Kavitha New Party | త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు : కవిత
TAGGED:banana peeleveryday physicsfriction scienceig nobel awardpolysaccharide gelscience factsslippery surfacewhy banana peel slips
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే! March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
Next Article Raw Mango Benefits | వేసవిలో పచ్చి మామిడి తింటున్నారా.. హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా లేవుగా! Raw Mango Benefits | వేసవిలో పచ్చి మామిడి తింటున్నారా.. హెల్త్ బెనిఫిట్స్ మామూలుగా లేవుగా!
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Markapuram Bus Accident: 10 Dead in Fiery Crash

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?