అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay Kondagattu Yatra | కొండగట్టు అంజన్న ఆలయ (Kondagattu Anjana Temple) అభివృద్ధి బాధ్యతలు తాను తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన శనివారం కరీంనగర్ (Karimnagar) నుంచి కొండగట్టుకు అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించారు. పాదయాత్రగా స్వామి దర్శనానికి బయలు దేరారు. యాత్ర ప్రారంభించే ముందు ఆయన కరీంగనర్‌లో మీడియాతో మాట్లాడారు.
కొండగట్టుకు తాను చేపట్టిన ఈ పాదయాత్ర రాజకీయాలకు అతీతం అని తెలిపారు. దేశ సేవ, ధర్మ రక్షణ కోసం ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పారు. అజన్న ఆశీస్సులతో కరీంనగర్లో కాషాయ జెండా ఎగురవేశామన్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న సన్నిధి వరకు 40 కిలోమీటర్ల పాదయాత్ర సాగనుంది. భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు యాత్రలో పాల్గొన్నాయి. బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నేడు సాయంత్రం కొండగట్టుకు బండి సంజయ్ (Bandi Sanjay) చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.

Bandi Sanjay Kondagattu Yatra | కాంగ్రెస్ హిందువ్యతిరేక పార్టీ
కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అని బండి సంజయ్ మండిపడ్డారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సామ్యూల్ ఇటీవల బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై సంజయ్ స్పందించారు. సామ్యూల్ ఎమ్మెల్యేగా మళ్లీ ఎలా గెలిస్తాడో చూస్తామని హెచ్చరించారు. ఆయన మత విధ్వేషాలను రెచ్చిగొట్టినందుకు కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: KTR Letter to Amit Shah | రాష్ట్రంలో పోలీసులపై నమ్మకం పోయింది : కేటీఆర్

