అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay Song | కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. గాయకుడిగా తన ప్రతిభను ప్రదర్శించారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల కానున్న పాటతో ప్రేక్షకులను అలరించారు.
Bandi Sanjay Song | శతాబ్ది ఉత్సవాల్లో..
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ పాటను ఆలపించారు. ఆయన గాత్ర ప్రదర్శనకు కార్యక్రమంలో పాల్గొన్నవారి నుంచి విశేష స్పందన లభించింది.
శ్రీరామనవమి నాడు విడుదల..
శ్రీరామునిపై భక్తి భావంతో రూపొందించిన బండి సంజయ్ గీతం శ్రీరామనవమి సందర్భంగా విడుదల కానుందని సమాచారం. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా కళాకారుడిగా తన ప్రతిభను చూపిస్తూ బండి సంజయ్ విశేషంగా ఆకట్టుకున్నారు.

