అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay Support | బాన్సువాడ పట్టణంలో ఇటీవల జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆరా తీశారు. పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బాన్సువాడ ఘటనలో అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యులను బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Bandi Sanjay Support | పార్టీ పరంగా జరిగిన ఘటన కాదు..
బాన్సువాడ బీజేపీ ఇన్‌ఛార్జి యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana) ఘటన వివరాలను బండి సంజయ్‌కి వివరించారు. ఇది పార్టీ పరంగా జరిగిన గొడవ కాదని, ఒక యువతి పట్ల అసభ్యంగా కొందరు ప్రవర్తించారని బాధితులు పేర్కొన్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. న్యాయవాదులతో తమ టీం మాట్లాడుతున్నట్టు తెలిపారు.
ఎవరు కూడా అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. బాన్సువాడ (Banswada)కు తమ నాయకులు వస్తుంటే అరెస్ట్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరే ఇలా ఉందని, వాళ్లే దాడులు చేసి మనవాళ్లను అరెస్ట్ చేస్తున్నారన్నారు. త్వరలోనే బెయిల్‌పై బయటకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. అవసరం అయితే హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Mudhiraj Leaders Felicitation | ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తాం

