అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఇంటర్ ఫలితాల్లో నగరంలోని బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి తమ సత్తా చాటారు. పలువురు విద్యార్థులు 950కి పైగా మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో విద్యార్థులు విశేష ఫలితాలు సాధించారు.
Bansal Junior College Nizamabad | ఫస్టియర్లో..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నమిత్, శ్రీహిత మార్కులకు గాను సాధించి కళాశాల టాపర్గా నిలిచారు. అదేవిధంగా మొదటి సంవత్సరం బైపీసీలో 440 మార్కుల గాను 435 మార్కులు తీన్యశ్రీ హాల్ కళాశాల టాపర్గా నిలిచింది. శ్లోకా జాదవ్ 440 మార్కులకు గాను 433 మార్కులు సాధించింది.
Bansal Junior College Nizamabad | సెకండియర్లో..
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కూడా బన్సల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో ధనుష్ 1000 మార్కులకు గాను 974 మార్కులు సాధించాడు. రోనిత్ 973 మార్కులు, బైపీసీ విభాగంలో ఎస్ ప్రవీణ్ 971 మార్కులు, ఈ లక్షణ 961 మార్కులు సాధించారు. విద్యార్థుల సాధించిన ఫలితాలకు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమబద్ధమైన బోధన విధానం, ప్రత్యేక పరీక్షా పద్ధతులు, విద్యార్థుల కృషి ఎంతో ఉందని యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం పింగిలి ప్రదీప్ రెడ్డి, మాదడి సాహితి, మేకల లక్ష్మణ్, మేకల జమున, నరాల సుధాకర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Inter Results | నిజామాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..
