అక్షరటుడే, బాన్సువాడ: Banswada Police | బాన్సువాడ మండలంలో (Banswada) అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక భారం.. పెంచలేమనే నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు తమ ఆడ శిశువును అమ్మేశారు.
Banswada Police | నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లిలో..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ (Nizamsagar) మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కిష్టవ్వ తన 18 రోజుల ఆడ శిశువును రూ.లక్షకు బీర్కూర్(Birkur) మండలంలోని ఓ దంపతులకు విక్రయించారు. కిష్టవ్వకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండగా 18రోజుల క్రితం మరోసారి ఆడపిల్ల పుట్టుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణలో ఎదురవుతున్న కష్టాల కారణంగా నాలుగో సంతానమైన శిశువును పోషించలేక అమ్మేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి శిశువును రక్షించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana Inter Results | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 12న ఫలితాలు..
