Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Basara Temple Development | రేపు బాసరకు సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Basara Temple Development | రేపు బాసరకు సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తెలంగాణ

Basara Temple Development | రేపు బాసరకు సీఎం.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సీఎం రేవంత్​రెడ్డి సోమవారం బాసరలో పర్యటించనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 3:12 సా.
Srinivas Kolluri
16 గంటలు ago
Share
Basara Temple Development

అక్షరటుడే, వెబ్​డెస్క్: Basara Temple Development | నిర్మల్​ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర (Basara) సరస్వతి మాత ఆలయానికి సోమవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Contents
  • Basara Temple Development | ఈవీ వాహనాలకే..
    • Basara Temple Development | సీఎం పర్యటనకు ఏర్పాట్లు

బాసరలోని సరస్వతి దేవస్థానం అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను శనివారం సీఎం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి జరగాలని చెప్పారు. రూ.225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ పనులకు సోమవారం సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

Basara Temple Development | ఈవీ వాహనాలకే..

రానున్న రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బాసరలో రోడ్లు అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా తిరుమల తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు రూపొంచించాలని సూచించారు. బాసర ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు.

Basara Temple Development | సీఎం పర్యటనకు ఏర్పాట్లు

బాసరలో సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల సీఎం పర్యటించే మార్గాలను తనిఖీ చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి. దర్శనానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి.

ఇది కూడా చదవండి : Eatala Rajender Comments | పార్టీ మార్పు ప్రచారంపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు

ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం
Tirumala Darshan Rules | తిరుమల భక్తులకు అలెర్ట్​.. శ్రీవారి దర్శనానికి కఠిన నిబంధన!
Ramzan Holiday Telangana | ఆ ఉద్యోగులకు శుభవార్త.. సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Gas Cylinder Booking | గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ గడువు 45 రోజులకు పెంపు
TAGGED:Basara TempleCM Revanth ReddyEV VehiclesNirmal NewsPilgrim FacilitiesRoad Upgradestemple development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Khanapur Municipal Election Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..
Next Article online gaming addiction | online gaming addiction | ఆన్​లైన్​ గేమింగ్​కు బానిసై చైన్​స్నాచింగ్​.. ఎట్టకేలకు పట్టుబడ్డ యువకుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?