Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం

తెలంగాణ

Basara temple development | ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్​.. బాసరలో 9 అంత‌స్తులతో రాజ‌గోపురం

బాసర సరస్వతి ఆలయాన్ని ప్రభుత్వం పునర్నిర్మించనుంది. 9 అంతస్తులతో రాజగోపురం నిర్మించనున్నట్లు తెలిపింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 5, 2026 8:12 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
Basara temple development

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara temple development | రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే సమక్క సారక్క గద్దెలను పునర్నిర్మించింది. మరోవైపు వేములవాడ రాజన్న (Vemulavada Rajanna) ఆలయ అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇటీవల భద్రాచలం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. తాజాగా బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించింది. సోమవారం సీఎం రేవంత్​రెడ్డి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Contents
  • Basara temple development | శృంగేరి పీఠాధిప‌తుల అనుమ‌తితో
  • Basara temple development | అన్ని వసతులు..

బాసర ఆలయంలో 9 అంతస్తులతో రాజగోపురం నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆలయ నమూనాను విడుదల చేసింది. స‌ర‌స్వ‌తి ఆల‌య (Saraswati Temple) పునః నిర్మాణాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.225 కోట్ల‌ను కేటాయించింది. జ్ఞాన స‌ర‌స్వ‌తి కొలువైన క్షేత్రం కావ‌డంతో ప్ర‌తి ఏటా పెద్ద సంఖ్య‌లో పిల్ల‌ల‌కు ఇక్క‌డ అక్ష‌రాభ్యాసాలు చేయిస్తుంటారు. వ‌సంత పంచ‌మి, ఇత‌ర ప‌ర్వ దినాల్లో అక్ష‌రాభ్యాసాల‌కు వ‌చ్చే పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు, వారి బంధువులు, భ‌క్తుల‌తో ఆల‌యం కిట‌కిట‌లాడుతుంది. ప్రాచీన ఆల‌యం కావ‌డం.. ఏటేటా పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌కు త‌గిన‌ట్లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌పోవ‌డంతో భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.. ఈ నేప‌థ్యంలో బాస‌ర ఆల‌య అభివృద్ధి చేప‌ట్టాల‌ని ప్రభుత్వం భావించింది.

Basara temple development | శృంగేరి పీఠాధిప‌తుల అనుమ‌తితో

బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు మాస్ట‌ర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిప‌తుల‌తో సంప్ర‌దించారు. గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పం, రాజ గోపురం, ఇత‌ర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్త‌ర ద్వారాల నిర్మాణాల‌కు సంబంధించి పీఠాధిపతుల అనుమ‌తులు తీసుకున్నారు. వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందించారు. ప్ర‌స్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు. ఉత్త‌రం వైపున 9 అంత‌స్తుల రాజ‌గోపురం, మూడు దిక్కుల్లో 7 అతంస్తుల గోపురాలు, 33 అడుగుల వెడ‌ల్పుతో నాలుగు దిక్కుల మాడ వీధులు, ఉత్త‌ర ద్వారం నిర్మించ‌నున్నారు.

Basara temple development | అన్ని వసతులు..

ఆల‌యంలో ప్ర‌తి నిర్మాణాన్ని శిల‌ల‌తో చేప‌ట్ట‌నున్నారు. ఆరు వేల మంది భ‌క్తులకు అన్ని వ‌స‌తుల‌తో 70 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌తో క్యూ కాంప్లెక్స్‌లు, 200 మంది ఏక‌కాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో వంటశాల‌, భోజ‌నశాల‌లు, ప్ర‌సాద పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆలయం నుంచి ఆవ‌త‌లి వైపు వెళ్లేందుకు అండ‌ర్ పాస్‌, అవ‌త‌లి వైపున సోలార్ రూప్‌టాప్‌తో వాహ‌నాల పార్కింగ్‌, దేవాల‌య ప్రాంగణంలో ఆహ్లాద‌క‌ర‌మైన మొక్క‌లతో పుష్ప‌వ‌నం ప‌నులు చేప‌ట్ట‌నున్నారు.

ఇది కూడా చదవండి : Khanapur Municipal Election | ఫలించిన జాన్సన్​ నాయక్​ వ్యూహం.. కాంగ్రెస్​కు దూరమైన ఖానాపూర్​ పీఠం..

Telangana Industrial Development | పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించాలి : సీఎస్​
Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Middle East War | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ‘హాహాకారాలు.. ఆర్తనాదాలు..’
Retired Employees Benefits | రిటైర్డ్​ ఉద్యోగులకు బెనిఫిట్స్​ చెల్లించాలి : హరీశ్​రావు
TAGGED:Basara TempleRajagopuramreligious tourismSaraswati templeTelangana templestemple development
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article tractor accident | tractor accident | భీమ్​గల్​లో విషాదం.. ట్రాక్టర్ పైనుండి పడి రైతు మృతి..
Next Article Kavitha new party Kavitha new party | జాగృతిలో భారీగా చేరికలు.. కవిత కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?