అక్షరటుడే, కామారెడ్డి: BC Caste Census | కులగణనలో బీసీలను విస్మరిస్తే కేంద్రానికి బుద్ధి చెప్తామని(kamareddy news) బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు అన్నారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.
BC Caste Census | బీసీ సుదీర్ఘ పోరాట ఫలితంగా..
బీసీల సుదీర్ఘ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో సమగ్ర కులగణన (backward classes india) చేపడతామని గత ఏడాది ఏప్రిల్ 30వ తేదీన జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయం(bc caste census) తీసుకుందన్నారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కుటుంబాల లెక్కింపు చేస్తూ, బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం అన్యాయమని అన్నారు. బీసీ కులగణన పై కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కొర్రీలు పెడుతూ అయిష్టంగా వ్యహరించిందని, దేశవ్యాప్తంగా బీసీలలో వచ్చిన చైతన్యం తప్పని పరిస్థితుల్లో కుల గణన చేస్తామని ప్రకటించిందన్నారు.
BC Caste Census | రెండు దఫాలుగా లెక్కింపు..
కేంద్ర ప్రభుత్వం జాతి జన గణనను(caste enumeration) రెండు దఫాలుగా చేపట్టాలని నిర్ణయించి, మొదటి దఫాలో కుటుంబాలను లెక్కించాలని, 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్ (social justice india) విడుదల చేసిందన్నారు. అందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను లెక్కించి బీసీ కుటుంబాలను లెక్కించక పోవడమేమిటని (indian politics) ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై బీసీలకు అనుమానాలు ఉన్నాయని, బీసీల అనుమానాలను నివృత్తి చేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ కులగణనపై ప్రత్యేకంగా చర్చించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దయాకర్, రాము పాల్గొన్నారు.
ఇది కూడాచదవండి: Dhannapal Indiramma houses | నిజామాబాద్లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్పాల్

