Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం

నిజామాబాద్

BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ సమాజానికి తీరని అన్యాయం జరిగిందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 22, 2026 1:42 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
5 రోజులు ago
Share
BC Declaration

అక్షరటుడే, ​భీమ్​గల్: BC Declaration | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీ సమాజానికి తీరని అన్యాయం జరిగిందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వేల్పూర్​లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు రాజపూర్ణనందం, మొండి అశోక్, శివసారి నర్సయ్య, బట్టపూర్ ప్రవీణ్ యాదవ్, రేగుంట దేవేందర్ మాట్లాడారు.

Contents
  • ​BC Declaration | అంకెల్లో మోసం.. అమలులో శూన్యం..
    • BC Declaration | ​వృత్తి కులాలకు మొండిచేయి..

​BC Declaration | అంకెల్లో మోసం.. అమలులో శూన్యం..

ఎన్నికల వేళ బీసీలకు ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్.. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.12,551 కోట్లు (3.85%) మాత్రమే కేటాయించి మోసం చేసిందని బీసీ నాయకులు మండిపడ్డారు. గత రెండేళ్లలో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని గణాంకాలు చెబుతున్నాయన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని కాలయాపన చేస్తూ స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో బీసీల వాటాను అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు.

BC Declaration | ​వృత్తి కులాలకు మొండిచేయి..

ముదిరాజ్, గంగపుత్ర, గొల్ల కురుమ, గౌడ, పద్మశాలి, రజక వంటి కులాలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని నాయకులు వాపోయారు. గొర్రెల పంపిణీ, చేనేత, వృత్తి ఆధారిత పథకాలకు సున్నా కేటాయింపులు చేయడం దారుణమన్నారు. రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రస్తావన లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీలు నెరవేర్చకపోతే గ్రామగ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీస్తామని హెచ్చరించారు.

​సమావేశంలో నాయకులు చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష్, రేగుల్ల రాములు, దొకంటి నర్సయ్య, కొత్తపల్లి అశోక్, రామ్ రాజ్ గౌడ్, పాపాయి పవన్, బింగి బాల చందర్, శ్రీనివాస్, పాలేపు అశోక్, రాజేశ్వర్, పర్స దేవన్న, మాణిక్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: TPCC Chief District Tour | పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన

ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Temple Attack Allegation | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేదు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:Balakonda ConstituencyBC DeclarationBC Leaders ProtestBC Welfare IssuesBRS vs CongressBudget Allocation ControversyKamareddy NewsTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article LPG Ship India LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక
Next Article Cyber Fraud Cyber Fraud | లింక్​ పంపి.. ఎమ్మెల్యే ఖాతా ఖాళీ చేసిన సైబర్​ నేరగాళ్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?