Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన

తెలంగాణతాజా వార్తలు

BC Reservation Protest | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​.. బీఆర్​ఎస్​ సభ్యుల నిరసన

బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్​ఎస్​ సభ్యులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు గన్​పార్క్​ వద్ద నిరసన తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 26, 2026 12:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
17 గంటలు ago
Share
BC Reservation Protest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservation Protest | రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసిన కాంగ్రెస్​ పార్టీ (Congress Party) గద్దె దిగాలని బీఆర్​ఎస్​ (BRS) నాయకులు డిమాండ్​ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం గన్​పార్క్​లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు.తాము అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్​ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Contents
  • BC Reservation Protest | బీసీ సబ్ ప్లాన్​
    • BC Reservation Protest | బీసీ డిక్లరేషన్​ పేరిట..
      • BC Reservation Protest | హామీలు అమలు చేయాలి

ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపింది. కేంద్రం వాటిని పెండింగ్​లో పెట్టింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టులు కొట్టేశాయి. దీంతో బీసీ రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ, మున్సిపల్​ ఎన్నికలను కాంగ్రెస్​ నిర్వహించింది. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్​ఎస్​ సభ్యులు నిరసన తెలిపారు.

BC Reservation Protest | బీసీ సబ్ ప్లాన్​

మాజీ మంత్రి హరీశ్​రావు (Former Minister Harish Rao) ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. బీసీ సబ్ ప్లాన్ అమలు ఏదంటూ నినాదాలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా, బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

BC Reservation Protest | బీసీ డిక్లరేషన్​ పేరిట..

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రతీ వార్షిక బడ్జెట్​లో రూ.20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి (Kamareddy) డిక్లరేషన్ పేరుతో సిద్ధరామయ్యతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లు దండుకున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే బీసీ సబ్​ ప్లాన్​ కింద మొదటి ఏడాది రూ.800 కోట్ల ఖర్చు చేస్తామని మోసం చేశారన్నారు. రెండో ఏడాది రూ.11 వేల కోట్లు కేటాయించి, రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.

BC Reservation Protest | హామీలు అమలు చేయాలి

కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీ వర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Midday Meal Fish | విద్యార్థులకు గుడ్​న్యూస్​.. మధ్యాహ్న భోజనంలో చేపలు

March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
Hyderabad Pet Tragedy | పిల్లుల కోసం ఇద్దరు యువతుల ఆత్మహత్య
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
March 12 Horoscope | జీవిత భాగస్వామి అండతో.. కష్టాల నుంచి గట్టెక్కే అదృష్ట రాశులవారు వీరే!
Siddhi Vinayaka Temple Donation | సిద్ధివినాయక ఆలయానికి రూ.50 లక్షల విరాళం
TAGGED:assembly protest newsbc reservation protestbc welfare schemesBRS vs CongressCongress Partyreservation issue indiaTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mission Bhagiratha Salaries Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
Next Article Balakrishna Lifetime Achievement Balakrishna Lifetime Achievement | బాలకృష్ణకు అంతర్జాతీయ గౌరవం.. ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?