అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Women Reservation | బీసీల కోసం తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. పూలే మళ్లీ పుట్టాడా అనే స్థాయిలో బీసీల కోసం పని చేస్తామన్నారు.
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి (Jyotirao Phule Jayanti) సందర్భంగా ఆయన చిత్రపటానికి కవిత నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ ఉపకోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరగనుందన్నారు. అవసరమైతే ఢిల్లీ (Delhi)కి వెళ్లి అన్ని పార్టీల వారితో ఈ అంశంపై మాట్లాడుతానని తెలిపారు.
BC Women Reservation | ప్రభుత్వ నిర్లక్ష్యం
పూలే విగ్రహ ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. ఆయన ఆశయాలను సాధించేలా పోరాటం చేయటమే నిజమైన నివాళి అన్నారు. పూలే విగ్రహాన్ని ఆయన జయంతి రోజు వరకు పూర్తి చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
సమాజంలో మార్పు తేవాలంటే ముందు ఆ మార్పు మన నుంచే మొదలుకావాలని కవిత సూచించారు. మనం చేపట్టే బాట కూడా ముళ్లబాట మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ దేశంలో మహిళ బిల్లు రావటానికి తెలంగాణ జాగృతి ఉద్యమమే కారణమని కవిత అన్నారు.
ఇది కూడా చదవండి..: Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు
