అక్షరటుడే, వెబ్‌డెస్క్: BEL Engineer Jobs | ఒప్పంద ప్రాతిపదికన 18 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited) నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్ పూర్తి చేసినవారు అర్హులు. ఎంపికైనవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టు: ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 6
BEL Engineer Jobs | విద్యార్హత
కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఐదేళ్ల ఉద్యోగానుభవం అవసరం.
అఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్/ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్/ సిస్కో నెట్‌వర్కింగ్ అసోసియేట్/ సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్కింగ్ ప్రొఫెషనల్/ సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఉండాలి.
వయో పరిమితి : 35 ఏళ్లలోపు వారు అర్హులు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.60 వేలు.
పోస్టు: ప్రాజెక్ట్ ఇంజినీర్-1
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 12
విద్యార్హత: కంప్యూటర్ సైన్స్/ సైబర్ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల ఉద్యోగానుభవం అవసరం. ఓఎస్‌సీపీ/ సీపీహెచ్/సీసీఎనఏ/ సీసీఎన్‌పీ/ సీఐఎఫ్‌పీ సర్టిఫికెట్ ఉండాలి.
వయో పరిమితి : 32 ఏళ్లలోపువారు అర్హులు. ఓబీసీలక” మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: మొదటి సంవత్సరం నెలకు రూ.40 వేలు.
రెండు పోస్టులకూ ఏటా రూ. 5 వేల చొప్పున వేతనం పెరుగుతుంది. ఇన్సూరెన్స్ ప్రీమియం, అటైర్ అలవెన్స్, స్టిచింగ్ ఛార్జీలు, ఫుట్‌వేర్ అలవెన్స్ నిమిత్తం ఏటా రూ.12 వేలు చెల్లిస్తారు.
BEL Engineer Jobs | దరఖాస్తు విధానం
దరఖాస్తు ఫీజు: రూ.400(జీఎస్టీ అదనం). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు : మార్చి 24.
ఎంపిక విధానం : అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. బెంగళూరు, న్యూదిల్లీల్లో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు 30 శాతం.
రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారికి బెంగళూరులో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైనవారి వివరాలను సంస్థ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
పూర్తి వివరాలకు సంస్థ వెబ్‌సైట్ https://belindia.in/లో సంప్రదించగలరు.

ఇది కూడా చదవండి..: IT Job Layoffs | యుద్ధం – ఏఐ ప్రభావం.. ఇక ఐటీ ఉద్యోగాలు ఉండవా.. ఇప్పటికే భారీగా కోత.. నవంబర్ తర్వాత ఏమి జరగబోతోంది!

