అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bellamkonda Sreenivas Wedding | టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలను కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
Bellamkonda Sreenivas Wedding | పవిత్రక్షేత్రం తిరుపతిలో..
తాజా వివరాల ప్రకారం.. ఈ నెల (ఏప్రిల్) 5న నిశ్చితార్థం జరగనుంది. పవిత్రక్షేత్రం తిరుపతిలో ఏప్రిల్ 29న వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు కొందరు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
పెళ్లి అనంతరం టాలీవుడ్ ప్రముఖుల కోసం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ప్రత్యేక రిసెప్షన్ నిర్వహించే అవకాశముందని తెలిసింది. ఈ రిసెప్షన్‌కు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Ramayana Teaser | హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన రామాయణ టీజర్.. ఆకట్టుకుంటున్న వీఎఫ్ఎక్స్
