అక్షరటుడే, వెబ్డెస్క్ : Bellamkonda Srinivas Engagement | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఆయన కావ్యారెడ్డి (Kavya Reddy) అనే యువతితో నిశ్చితార్థం చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలపై స్పందించిన శ్రీనివాస్, నిజం ఏమిటో అభిమానులకు స్పష్టం చేశారు.సోషల్ మీడియా (Social Media) వేదికగా ఆయన తన భావాలను ఎంతో రొమాంటిక్‌గా వ్యక్తం చేశారు. “నా కావ్యమ్మకు… జీవితానికి దానికంటూ ఒక అందమైన సమయం ఉంటుంది. ఆ సమయమే నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చి నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు.
Bellamkonda Srinivas Engagement | అది ప్రకటన మాత్రమే..
నా రోజులను పాజిటివిటీతో, లెక్కలేనన్ని చిరునవ్వులతో నింపేశావు. నీ ముఖంలో ఆ చిరునవ్వు ఎప్పటికీ చెదరకుండా చూసుకుంటాను. మనమిద్దరం శాశ్వతంగా కలిసి ఉండే ఆ క్షణాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ తన ప్రేమను వ్యక్తపరిచారు.అయితే ఇటీవల జరిగిన కార్యక్రమంపై వస్తున్న వార్తలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. చాలా మంది అడుగుతున్నట్లుగా అది నిశ్చితార్థం (Engagement) కాదని, కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఒక చిన్న ప్రకటన మాత్రమేనని తెలిపారు. అసలు నిశ్చితార్థం, పెళ్లి వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు.

Bellamkonda Srinivas Engagement | ఇక త్వరలోనే ఆయన పెళ్లి వేడుకలు
త్వరలోనే అధికారికంగా తేదీలను ప్రకటిస్తామని, ఆ వేడుకలను అందరితో కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తనకు అభిమానుల ప్రేమ, మద్దతు ఎంతో ముఖ్యమని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రకటనతో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. ఇక త్వరలోనే ఆయన పెళ్లి వేడుకలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Ustaad Bhagat Singh Glimpse | ఇక గూస్ బంప్సే.. ఊపేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్

