Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ

జాతీయం

Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ

ప్రధాని మోదీ గురువారం బెంగాల్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఎంసీ పాలనపై విమర్శలు చేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 1:49 సా.
Srinivas Kolluri
4 గంటలు ago
Share
Bengal Elections

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bengal Elections | బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తృణమూల్​ కాంగ్రెస్​పై విరుచుకు పడ్డారు.

Contents
  • Bengal Elections |రాష్ట్రవ్యాప్తంగా..
    • Bengal Elections | అభివృద్ధికి అడ్డంకులు

టీఎంసీ ప్రజల మనసుల్లో భయాన్ని నాటిందని ప్రధాని అన్నారు. చొరబాటుదారులు బెంగాల్‌ యువత ఉద్యోగాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు ఉండవని మాట ఇచ్చారు. ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Bengal Elections |రాష్ట్రవ్యాప్తంగా..

గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee)పై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈసారి భబానీపూర్‌లోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం మేదినీపూర్, నందిగ్రామ్ (Nandigram) మార్పునకు మార్గాన్ని చూపించాయన్నారు.

Bengal Elections | అభివృద్ధికి అడ్డంకులు

దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా.. బెంగాల్​లోని టీఎంసీ ప్రభుత్వం (TMC Government) మాత్రం అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని మోదీ ఆరోపించారు. అభివృద్ధి చెందిన బెంగాల్ నిర్మాణానికి నిర్మమ్ సర్కార్ నిష్క్రమణ చాలా అవసరమన్నారు. మమత పాలనలో హల్దియాలోని ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయని, అల్లరి మూకలు, నేరగాళ్ల దుకాణాలు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు. ఒకప్పుడు దేశ ప్రగతికి పునాది వేసి, తయారీ, వాణిజ్య రంగాలను బలోపేతం చేసిన బెంగాల్‌ను టీఎంసీ అన్ని రంగాల్లో దిగజార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్​ జరగనుంది. మే 4న కౌంటింగ్​ నిర్వహించనున్నారు. ఇక్కడ విజయం సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత ఎన్నికల్లో సైతం తీవ్రంగా పోరాడినప్పటికి తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలను గెలుచుకుంది.

ఇది కూడా చదవండి..: Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

India Oil Reserves | ఆయిల్ నిల్వలపై కేంద్రం క్లారిటీ
Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Forbes India Billionaires | ఫోర్బ్స్ జాబితాలో భారత్‌కు 3వ స్థానం
Indigo Emergency Landing | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Sathankulam Custodial Death Case | లాకప్​డెత్ కేసులో సంచలన తీర్పు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
TAGGED:Bengal ElectionsBJPCM Mamata BanerjeeNandigramPM Narendra ModiTMC Government
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Hindu Deity Disrespect Hindu Deity Disrespect | హిందూ దేవుళ్లను కించపరుస్తూ మహిళ పోస్టులు
Next Article CPD Committee Member CPD Committee Member | సీపీడీ కమిటీ సభ్యుడిగా డాక్టర్​ అరవింద్ గౌడ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?