అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru Hotels Closed | మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌ను కూడా తాకాయి.
Bengaluru Hotels Closed | ఇంధన రంగంలో సవాళ్లు
ముఖ్యంగా ఇంధన రంగంలో భారత్‌కు సవాళ్లు ఎక్కువ అవుతున్నాయి. చమురు, గ్యాస్ ధరలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. పరిస్థితి నియంత్రణలోనే ఉందని కేంద్రం చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఇంధన సరఫరాపై ఆందోళన లేకపోలేదు.

ఇటీవలే వంటగ్యాస్ ధరలు పెరిగాయి. దీనికితోడు గృహ అవసరాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ వంట గ్యాస్ సరఫరా చేయాలనే ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయంలో గందరగోళం నెలకొంది.
ఈ నేపథ్యంలో హోటల్ రంగం ఒత్తిడికి లోనవుతోంది. ఈ క్రమంలో కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో హోటళ్ల సంఘం కీలక నిర్ణయం ప్రకటించింది. నేటి (మార్చి 10) నుంచి నగరంలో హోటళ్లు మూసివేసిస్తున్నట్లు వెల్లడించింది.

