అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru Lamborghini Stunt | కొంతమంది కార్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. తాజాగా బెంగళూరు (Bengaluru)లో ఓ వ్యక్తి లంబోర్గిని కారుతో స్టంట్లు చేశారు.
బెంగళూరులో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి లంబోర్గిని కారును నిర్లక్ష్యంగా, అతివేగంగా నడిపాడు. ఎంజీ రోడ్డు అనిల్ కుంబ్లే సర్కిల్ (Anil Kumble Circle) వద్ద ఫ్లై ఓవర్ కింద కారుతో స్టంట్లు చేశాడు. రోడ్డుపై ఇతర వాహనాలు ఉన్నాయోనే ఆలోచన లేకుండా వేగంగా కారును నడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయింది. ఒక పబ్లిక్ జంక్షన్‌లో ఇతర వాహనాలు ఉన్నప్పటికీ లంబోర్గిని (KA 05 NR 0009) కారు పదేపదే స్టంట్లు చేసినట్లు నెటిజన్లు పేర్కొన్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెంగళూరు పోలీసులు (Bengaluru Police) స్పందించారు. కారుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Bengaluru Lamborghini Stunt | నెటిజన్ల ఆగ్రహం
కారుతో ప్రమాదకరంగా విన్యాసాలు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల ప్రాణాలతో ఇలా చెలాగటం ఆడటం సరికాదని మండిపడుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ కార్లు (Luxury Cars) ఉన్న పలువురు యువకులు ఇలా రోడ్లపై హంగామా చేస్తూ రీల్స్ తీస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Video from last night in Bengaluru. Lamborghini KA 05 NR 0009 seen repeatedly doing donuts at a public junction under a flyover while other vehicles were present, posing a safety risk.@blrcitytraffic @BlrCityPolice please look into this and take action if required. pic.twitter.com/UuOHXljE5i
— CitizenReportIN (@CitizenReprt) March 21, 2026
ఇది కూడా చదవండి..: Hormuz Indian Death | హార్ముజ్ జలసంధి సమీపంలో భారతీయుడి మృతి

