అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bengaluru Software Couple | బెంగళూరు (Bengaluru)లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
తెలంగాణలోని సిద్దిపేట (Siddipet) ప్రాంతానికి చెందిన భాను చందర్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతని భార్య షాజియా సైతం టెకీగా పనిచేస్తోంది. కొత్తనూరు ప్రాంతంలోని వారి నివాసంలో భాను చందర్‌రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతదేహాన్ని చూసిన తర్వాత షాజియా వారి భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది.
Bengaluru Software Couple | కుటుంబ కలహాలతో..
భానుచందర్‌రెడ్డి, షాజీయాకు వివాహం అయింది. అంతకు ముందు వారు సహజీవనం చేశారు. పెళ్లయ్యాక వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి మధ్య కొనసాగుతున్న వైవాహిక కలహాలే ఈ జంట ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
ఇది కూడా చదవండి..: PAN and Banking Changes | పాన్ కార్డ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు.. రేపటినుంచి అమలులోకి పలు మార్పులు
