అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bhadrachalam Talambralu | భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలు, ముత్యాలను భక్తుల ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీజీఎస్ కార్గో నిజామాబాద్ ఇన్ఛార్జి (TGS Cargo Nizamabad In-charge) డీఎం ఈ కిషోర్ తెలిపారు.
Bhadrachalam Talambralu | ఎల్లారెడ్డి పట్టణంలో..
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లతో పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవను పొందడానికి భక్తులు కేవలం రూ.151 చెల్లించి సమీప టీజీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్లలో (ఎల్లారెడ్డి బస్టాండ్) బుకింగ్ చేసుకోవచ్చు. కల్యాణం అనంతరం ఆ తలంబ్రాలను కార్గో ద్వారా నేరుగా భక్తుల ఇంటికి చేరవేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు సిద్ధి శ్రీధర్, గాదె తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Bhadrachalam Talambralu | అవకాశాన్ని వినియోగించుకోవాలి..
ఈ సందర్భంగా ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భద్రాద్రి రాములవారి (Bhadradri Ramudu) ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ త్రిఖండ సంఘటనా మంత్రి వినోద్, నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, ఇన్ఛార్జి–2 డీఎం సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర సమాచారం కోసం 93475 47652లో సంప్రదించవచ్చన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Chairperson Election | కామారెడ్డి ఛైర్పర్సన్ ఎన్నిక చెల్లదు.. కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి

