అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhadrachalam Temple | భద్రాచలం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీరామ నవమి (Sriram Navami) సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి భూమిపూజ చేశారు.
భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మిథిల స్టేడియంలో జరిగిన వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి హాజరు అయ్యారు.
Bhadrachalam Temple | రూ.351 కోట్లు కేటాయింపు
ఆలయ విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ. 351 కోట్ల నిధులను కేటాయించింది. ఆయా పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.180 కోట్లు, పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 96 కోట్లు, గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ. 75 కోట్లు కేటాయించారు.
Bhadrachalam Temple | దక్షిణ అయోధ్యగా..
ఆధ్యాత్మిక వైభవాన్నిచాటి చెప్పేలా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని ‘దక్షిణఅయోధ్య’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. చారిత్రక వైభవానికి ప్రతిరూపమైన భద్రాచల దేవస్థానాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సీతారామచంద్రుల ఆశీస్సులతో ఆలయాభివృద్ధి పనులు సజావుగా జరగాలని కోరారు.
దీనిని కూడా చదవండి : Ram Navami in Vemulawada | వేములవాడలో ఘనంగా శ్రీరామనవమి.. వివాహం చేసుకున్న హిజ్రాలు

