అక్షరటుడే, వెబ్డెస్క్ : Big TV Resignations | తెలుగు న్యూస్ ఛానెల్ (Telugu News Channel) బిగ్ టీవీలో రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. సీఈవో అజయ్ కొండా (CEO Ajay Konda) రాజీనామా చేసినట్లు సమాచారం. కాగా.. ఆధిపత్య పోరు రాజీనామాలకు దారి తీసిందనే ప్రచారం జరుగుతోంది.
టీవీ చానెల్ మేనేజింగ్ ఎడిటర్ సతీష్ సహా ముఖ్య స్థానాల్లోని జర్నలిస్టులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఇన్‌పుట్ ఎడిటర్ నగేష్, స్వేచ్ఛ ఎడిటర్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, మెదక్ సీనియర్ రిపోర్టర్ దుర్గారెడ్డి (Senior Reporter Durgareddy) , అనంతపూర్ రిపోర్టర్ యోగానంద్, బిగ్ టీవీ డిజిటల్ హెడ్ కార్తీక్ పవన్ గాదె ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు 50 మందికి పైగా జర్నలిస్టులు రిజైన్ చేసినట్లుగా సమాచారం.
Big TV Resignations| కీలక స్థానాల్లో వారే..
బిగ్ టీవీ ఓనర్ తెలంగాణ (Telangana)కు చెందిన వారు. అయితే ఆ సంస్థలోని కీలక స్థానాల్లో ఆంధ్ర వారు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లుగా ఆంధ్రవారే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా ఒకే సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. తెలంగాణ ఉద్యోగులను తీసేసి తమ ప్రాంతం వారిని ఏపీ హెడ్లు తెచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పులువురు రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Elevated Flyover NHAI | ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదం
