అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bike Stunt Case | పలువురు యువకులు బైక్‌లు, కార్లతో ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. రీల్స్ కోసం బైక్‌లతో స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారి తీరుతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో పలువురు పోకిరీలకు పోలీసులు షాక్ ఇచ్చారు. నలుగురు యువకులు పోలీసుల ఎదుటే బైక్‌తో స్టంట్లు చేశారు. పోలీస్ కారును ఓవర్ టేక్ చేసి, ముందకు వెళ్లిన తర్వాత స్టంట్లు చేశారు. అంతేగాకుండా దానిని వీడియో కూడా తీశారు. పోలీసులు వెంటనే వారిని ఆపి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌లో చోటు చేసుకుంది.
Bike Stunt Case | కేసు నమోదు
అత్తాపూర్ (Attapur)లో కొందరు యువకులు పోలీసు అధికారుల ముందే అత్యంత ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి తీవ్ర గందరగోళం సృష్టించారు. అత్తాపూర్ పోలీసులు (Attapur Police) వెంటనే వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఒక కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Bike Stunt Case | కఠిన చర్యలు అవసరం
హైదరాబాద్ నగరంలో పలువురు పోకిరీలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై హంగామా చేస్తున్నారు. ఇతరుల గురించి పట్టించుకోకుండా వాహనాలతో స్టంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
#Hyderabad: #Youths perform dangerous #bikestunts in front of #police at #Attapur
A group of #miscreants created #chaos in Attapur by performing risky bike stunts right in front of police officers, showing blatant #overconfidence.
The gang even recorded the stunts on their… pic.twitter.com/9uYspJszDo
— NewsMeter (@NewsMeter_In) March 31, 2026
ఇది కూడా చదవండి..: Nand Ghar Centres Hyderabad | హైదరాబాద్‌లో ‘నంద్ ఘర్’ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
