Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

జాతీయం

BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

పశ్చిమ బెంగాల్​లో గెలుపే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 8:01 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
BJP Bengal Candidates

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BJP Bengal Candidates | దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) ఆదివారం షెడ్యూల్​ విడుదల చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ (BJP) కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళలో సత్తా చాటాలని కాషాయ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

Contents
  • BJP Bengal Candidates | 144 మంది పేర్లు ప్రకటన
    • BJP Bengal Candidates | మమత బెనర్జీపై..
      • BJP Bengal Candidates | పోటీ చేస్తున్న ప్రముఖులు

పశ్చిమ బెంగాల్​లో అధికారం కోసం కమలం పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సైతం తీవ్రంగా శ్రమించినా బెంగాల్ ఓటర్లు టీఎంసీ (TMC)కి పట్టం కట్టారు. బీజేపీ 77 సీట్లు గెలిచినా.. 38 శాతం ఓట్లు సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల బీహార్​లో ఎన్​డీఏ (NDA) ఘన విజయం సాధించిన అనంతరం మోదీ మాట్లాడుతూ.. తర్వాత బెంగాల్​ అని తెలిపారు. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీకి మధ్య హోరాహోరీగా సాగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ బెంగాల్​లో తన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.

BJP Bengal Candidates | 144 మంది పేర్లు ప్రకటన

పశ్చిమ బెంగాల్​లో మొత్తం 292 సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్​ 23, 29 తేదీల్లో పోలింగ్​ నిర్వహించనున్నారు. దీంతో కాషాయ పార్టీ మొదటి విడతలో 144 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సువేందు అధికారి కొనసాగుతున్నారు. ఆయన నందిగ్రామ్, భబానీపూర్ నుంచి పోటీ చేయనున్నారు.

BJP Bengal Candidates | మమత బెనర్జీపై..

bengal

గత ఎన్నికల్లో సువేందు అధికారి సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee)పై పోటీ చేసి గెలుపొందారు. నందిగ్రామ్​లో మమతాను ఆయన ఓడించారు. దీంతో మమత భబానిపూర్​లో గెలిచిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిచారు. దీంతో మరోసారి సువేంద్​ అధికారి మమత గతంలో పోటీ చేసిన, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికలలో అధికారి నందిగ్రామ్ స్థానం నుంచి మమతా బెనర్జీపై పోటీ చేసి సుమారు 2 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

BJP Bengal Candidates | పోటీ చేస్తున్న ప్రముఖులు

తొలి జాబితాలో పలువురు ప్రముఖులకు బీజేపీ అవకాశం కల్పించింది. దిలీప్ ఘోష్ (మాజీ బీజేపీ అధ్యక్షుడు) ఖరగ్‌పూర్ సదర్ నుంచి, అగ్నిమిత్ర పాల్ (ఫ్యాషన్ డిజైనర్) అసన్‌సోల్ దక్షిణ నుంచి బరిలో నిలవనున్నారు. సువేందు అధికారి నందిగ్రామ్, భబానీపూర్, అశోక్ దిండా (మాజీ క్రికెటర్) మోయినా నుంచి, రుద్రనీల్ ఘోష్ (నటుడు): శివపూర్ నుంచి పోటీ చేస్తారు.

దీనిని కూడా చదవండి : Assembly Election Schedule | మోగిన నగారా.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్​

Modi Political Statement | రాజకీయాల్లో ఫుల్​స్టాప్​ లేదు: ప్రధాని మోదీ
Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
Lok Sabha Speaker | లోక్‌సభ స్పీకర్‌పై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
TAGGED:Bengal Assembly PollsBJPBJP candidates listIndian PoliticsMamata BanerjeeSuvendu Adhikariwest bengal elections
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy ACB Raids | Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు
Next Article Kamareddy Hailstorm Alert | Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?