Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి

నిజామాబాద్

BJP Collectorate Protest | ప్రభుత్వ హామీలపై నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్​ను ముట్టడిస్తాం: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 2:59 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
BJP Collectorate Protest

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BJP Collectorate Protest | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Contents
  • BJP Collectorate Protest | ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం..
    • BJP Collectorate Protest | ప్రజల మద్దతు అవసరం..
      • BJP Collectorate Protest | రైతుల సమస్యలపై స్పందన కరువు..

BJP Collectorate Protest | ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం..

ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం (State Government) అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తాము నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంగళ, బుధవారాల్లో తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

BJP Collectorate Protest | ప్రజల మద్దతు అవసరం..

బీజేపీ (BJP) ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ కలెక్టరేట్ ముట్టడికి ప్రజల మద్దతు అవసరమని దినేష్ కులచారి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలపై ప్రజల తరపున బీజేపీ ప్రశ్నిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. డబుల్​ బెడ్​రూమ్ ఇళ్ల విషయంలో ఇప్పటివరకు ఒక్క ఇంటిని కూడా ప్రజలకు అందించలేకపోయారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

BJP Collectorate Protest

BJP Collectorate Protest | రైతుల సమస్యలపై స్పందన కరువు..

రాష్ట్రంలో రైతుల సమస్యలపై కాంగ్రెస్ స్పందించడం మానేసిందని దినేష్​ కులాచారి దుయ్యబట్టారు. మొక్కజొన్న పంటలకు సరైన ధర లభించక రైతులు అవస్థలు పడుతున్నారని.. మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,600 మధ్యలో ఉండటం వల్ల రైతు తాను పెట్టిన పెట్టుబడి కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కలెక్టరేట్ (Collectorate) ముట్టడిని నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. రైతు రుణమాఫీ అమలు కాలేదని నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్య, వైద్య రంగాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని తీవ్రంగా విమర్శించారు. జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఉన్నప్పటికీ ప్రజలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని ఆయన విమర్శించారు.

సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్​కర్​ లక్ష్మీ నారాయణ, నాగోళ్ల లక్ష్మీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రమోద్ కుమార్, బంటు రాము, నిమ్మల శ్రీనివాస్, బాన్సువాడ ఇన్​ఛార్జి కోనేరు శశాంక్, రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జిల్లా కార్యదర్శులు దాంపల్లి జ్యోతి, పోల్కం వేణు, పాలెపు రాజు, బద్దం కిషన్, పుట్ట వీరేందర్, జగన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు

Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Holi Celebrations | ఘనంగా హోలీ సంబరాలు
TAGGED:BJP protestCollectoratecollectorate demonstrationCongress GovernmentDinesh Kulacharifarmer concernshousing issuespublic grievancesTelangana Politicsunemploymentunfulfilled promises
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Breath Analyzers Distribution Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
Next Article HYDRAA Land Protection HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?