అక్షరటుడే, కామారెడ్డి: BJP councillors protest | వార్డుల్లో శానిటేషన్ లేబర్లు ఎక్కడ పని చేస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు (BJP councillors protest) మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ప్రశ్నించారు. తమ వార్డులలో నెలకొన్న సమస్యల పరిష్కారం (Kamareddy municipality) కోసం మంగళవారం కమిషనర్‌ను కలిశారు.
BJP councillors protest | కమిషనర్ నుంచి సమాధానం..
ఈ సందర్భంగా పలు అంశాలను కమిషనర్ ముందు ప్రస్తావించగా కమిషనర్ నుంచి సమాధానం రాకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో కమిషనర్ దాటవేత ధోరణి అవలంభించడంతో వారు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పట్టణంలో శానిటేషన్ లేబర్ హాజరు పట్టికలో (anitation workers controversy) ఉన్నప్పటికీ వారు వార్డుల్లో పని చేయడం లేదన్నారు.
BJP councillors protest | హాజరుపట్టికలోనే..
8వ వార్డులో పని చేస్తున్నట్లు చెబుతున్న ఇందిర, 34వ వార్డులో పని చేస్తున్నట్లు చెబుతున్న స్వప్న, 43వ వార్డులో పని చేస్తున్నట్టు చెబుతున్న రాజేశ్వరి వీరిలో ఎవరు కూడా శానిటేషన్ పని చేయటం (Telangana local politics) లేదని కౌన్సిలర్లు వివరించారు. సదరు వర్కర్లు హాజరు పట్టికలో (Kamareddy news) మాత్రం రోజూ పని చేస్తున్నట్లు హాజరు వేస్తున్నారని పేర్కొన్నారు. వాళ్లు ఏదైనా నాయకుడి ఇంట్లో పని చేస్తున్నారా..? లేక అధికారి ఇంట్లో పని చేస్తున్నారా..? అని కమిషనర్‌ను ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.
BJP councillors protest | కమిషనర్ నిర్లక్ష్యధోరణి తగదు..
ఏ శాఖ గురించి అడిగినా సమాధానం ఇవ్వడం లేదని, పూర్తిగా నిర్లక్ష్య పూరిత సమాధానం కమిషనర్ (municipal administration issues) నుంచి వస్తోందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ లేబర్, వీధి దీపాలు, చెత్త సేకరణ బండి, చెత్త సేకరణ ట్రాక్టర్, దోమలు రాకుండా కొట్టే ఫాగ్ మిషన్, రాబోయే ఎండాకాలానికి సంబంధించి తాగునీటి ప్రణాళిక వంటి అంశాలపై వారం రోజుల్లో పరిష్కార మార్గాలు చూపాలని మున్సిపల్ కమిషనర్‌కు విన్నవించామన్నారు. వారం రోజుల్లో పరిస్థితులు మారకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

