అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: BJP Foundation Day | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఆవిర్భావ దినోత్సవాన్ని జక్రాన్పల్లి మండలంలోని (Jakranpalli Mandal) తొర్లికొండలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు.
BJP Foundation Day | అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..
ఈ సందర్భంగా సర్పంచ్ పద్మ నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనైనా.. దేశంలోనేనా అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) సారథ్యంలో రాష్ట్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని.. వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో బీజేపీ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో వంశీగౌడ్, సంజీవ్గౌడ్, భూమేష్, అజయ్ ప్రసాద్, స్వామి యాదవ్, బాలకిషన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Road Accident | జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఒకరి మృతి
