Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి

నిజామాబాద్

BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి

Srinivas kolluri
Last updated: మార్చి 18, 2026 4:41 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
BJP Promises Criticism

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BJP Promises Criticism | కేంద్రంలో బీజేపీ ఇచ్చిన హామీలను ముందు నెరవేర్చాలని డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి డిమాండ్​ చేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Contents
  • BJP Promises Criticism | ఆ హామీలు ఏమయ్యాయి..
    • BJP Promises Criticism | హామీలు ఒక్కొక్కొటిగా నెరవేరుస్తున్నాం..
      • BJP Promises Criticism | రైతు రుణమాఫీ

బీజేపీ నాయకులు (BJP Leaders) ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడిస్తామని ప్రకటించారన్నారు. ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. బీజేపీ హామీలు నెరవేర్చలేదని ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నారా.. లేదా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నందుకు ముట్టడి చేస్తున్నారా నిలదీశారు.

BJP Promises Criticism | ఆ హామీలు ఏమయ్యాయి..

కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి రాకముందు నల్లధనాన్ని బయటకు తీస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడి అకౌంట్​లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు నల్లధనాన్ని బయటకు తీసుకురానందుకు కలెక్టరేట్​ (Collectorate) ముట్టడిస్తారా అని ప్రశ్నించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. స్థానిక ఎంపీ కేంద్రం నుంచి నిజామాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదన్నారు. జిల్లా అభివృద్ధి గురించి అర్వింద్​ ఆలోచించిందే లేదని వ్యాఖ్యానించారు. మాధవనగర్ ఆర్వోబీ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

BJP Promises Criticism | హామీలు ఒక్కొక్కొటిగా నెరవేరుస్తున్నాం..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్​లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామని నగేశ్​రెడ్డి వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. గత పదేళ్ల బీఆర్​ఎస్​ (BRS) పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 24 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ప్రభుత్వమే అందిస్తుందన్నారు.

BJP Promises Criticism | రైతు రుణమాఫీ

అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసిందని డీసీసీ అధ్యక్షుడు (DCC President) వివరించారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తోందని చెప్పారు. పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. ఐదు లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. మహిళల కోసం ఉచిత ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఇలా అనేక హామీలను నెరవేర్చామని.. కానీ బీజేపీ మాత్రం తమ హామీలను అమలు చేయకుండా ఆందోళనలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, కార్పొరేటర్ ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Police Investigation Standards | కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి: ఎస్పీ

Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Kamareddy RTC Bus | లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు..
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
TAGGED:BJPBJP LeadersBJP Promises CriticismBRSCollectorateCongress GovernmentDCC President
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Rally Stock Market Rally | బుల్ జోరు.. రాణించిన సూచీలు.. రూ. 6 లక్షల కోట్లు పెరిగిన సంపద
Next Article Bike Theft Gang Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?