అక్షరటుడే, వెబ్‌డెస్క్: BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) సంబంధించి బీజేపీ మంగళవారం తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం తొమ్మిది మంది జాబితాను వెల్లడించింది. మార్చి 16న జరగనున్న కీలక ఎన్నికల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) బీహార్ నుంచి బరిలో నిలవనున్నారు.
BJP Rajya Sabha Candidates | బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే..
బీహార్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు శివేష్ కుమార్‌ను కూడా పార్టీ ఎంపిక చేసింది. అస్సాం రాష్ట్రం (Assam State) నుంచి తేరాష్ గోవాల్లా, జోగెన్ మోహన్‌లను నామినేట్ చేయగా.. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్ష్మీ వర్మను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక హర్యానా నుంచి సంజయ్ భాటియా, ఒడిశా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్‌ను బరిలో దింపనుంది. అలాగే సుజీత్ కుమార్‌ను ఎంపిక చేసింది. పశ్చిమబెంగాల్ నుంచి రాహుల్ సిన్హా (Rahul Sinha) అభ్యర్థిగా ప్రకటించింది.
BJP Rajya Sabha Candidates | అభ్యర్థుల వివరాలు..
సంజయ్ భాటియా హర్యానాలోని కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 నుంచి 2024 వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో 6,56,142 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. జోగెన్ మోహన్ హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని అస్సాం గవర్నమెంట్లో ముఖ్యమైన శాఖలను నిర్వహిస్తున్నారు. తేరాష్ గోవాల్లా అస్సాం రాష్ట్రంలోని దిబ్రుగఢ్ జిల్లా దులియాజన్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు.
శివేష్ కుమార్ బీహార్‌లోని అగియావన్ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. రాహుల్ సిన్హా వెస్ట్‌బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడిగా పార్టీకి సేవలు అందించారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ బీజేపీ (Chhattisgarh BJP)లో సీనియర్ నేత. ప్రస్తుతం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సుజీత్ కుమార్ గతంలో బిజు జనతా దళ్‌లో రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. 2024లో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ తరపున విజయం సాధించారు.
ఇది కూడా చదవండి..: Modi YouTube Subscribers | సోషల్ మీడియాలో మోదీ హవా.. 3 కోట్లు దాటిన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు

