అక్షరటుడే, బాన్సువాడ: BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని పార్టీ బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి అన్నారు. పట్టణంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని (BJP Foundation Day) పురస్కరించుకొని స్థానిక పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
BJP Strengthening Drive | ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1980 ఏప్రిల్ 6న బీజేపీ స్థాపించబడిందని గుర్తు చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి (Atal Bihari Vajpayee), ఎల్.కే. అద్వానీ (L.K. Advani) వంటి మహా నాయకుల కృషితో పార్టీ ఆరంభమైందన్నారు. మొదటి జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజపేయి బాధ్యతలు చేపట్టి పార్టీని బలోపేతం చేశారని వివరించారు. ఆయన ఆధ్వర్యంలో కేవలం రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ప్రారంభమైన బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిందన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది సభ్యత్వంతో పాటు ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉందని చెప్పారు.
BJP Strengthening Drive | నరేంద్ర మోదీ నాయకత్వంలో..
2014లో నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాభిమానాన్ని పొందిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, సిద్ది బాలరాజ్, నాయకులు చీకట్ల రాజు, పాశం భాస్కర్ రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కొండని గంగారం, శంకర్, మహేందర్, రఘువీర్, నాగరాజు, సాయి రెడ్డి, పురుషోత్తం, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Illegal Sand Mining | మొరం అక్రమ తవ్వకాలపై సీసీఎస్ పోలీసుల మెరుపుదాడి
