అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Black Monday to Stock Market | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలకు రెక్కలొచ్చాయి. గ్లోబల్ మార్కెట్లు (Global Markets) సైతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపైనా కనిపించింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 2,744 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే 2,089 పాయింట్లు ఎగబాకింది.
నిఫ్టీ 519 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 14 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 330 పాయింట్లు పెరిగింది. మార్కెట్ కోలుకుంటున్నట్లు కనిపించినా కొద్దిసేపటికే మళ్లీ సూచీలు పతనమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాల్యూ బయ్యింగ్‌తో సూచీలు కాస్త కోలుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 1,048 పాయింట్ల నష్టంతో 80,238 వద్ద, నిఫ్టీ 312 పాయింట్ల నష్టంతో 24,865 వద్ద స్థిరపడ్డాయి.
Black Monday to Stock Market | మెటల్, ఫార్మా మినహా..
మెటల్, ఫార్మా రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టాల బాటలో పయనించాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 0.24 శాతం, ఫార్మా 0.02 శాతం పెరిగాయి. నిఫ్టీ కన్జూమర్ డ్యూరెబుల్స్ ఇండెక్స్ 2.30 శాతం, ఆటో ఇండెక్స్ 2.20 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.15 శాతం, ఎనర్జీ 2.06 శాతం, యుటిలిటీ 1.86 శాతం, మీడియా 1.82 శాతం, రియాలిటీ 1.61 శాతం, పవర్ 1.56 శాతం క్షీణించగా.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు ఒక శాతానికిపైగా నష్టపోయాయి.
Black Monday to Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 821 కంపెనీలు లాభపడగా 3,561 స్టాక్స్ నష్టపోయాయి. 146 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 94 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 869 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్ ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 7.25 లక్షల కోట్లమేర ఆవిరయ్యింది.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 కంపెనీలు లాభాలతో, 27 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. బీఈఎల్ 2.09 శాతం, సన్‌ఫార్మా 0.84 శాతం, ఐటీసీ 0.38 శాతం లాభపడ్డాయి.
Top Losers : ఇండిగో 6.25 శాతం, ఎల్‌టీ 5 శాతం, అదానిపోర్ట్స్ 3.42 శాతం, మారుతి 3.29 శాతం, ఆసియన్ పెయింట్ 2.89 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Crash | కుదేలైన స్టాక్ మార్కెట్.. భారీ నష్టాల్లో సూచీలు

