అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BLO Absence Issue | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శిక్షణ నిర్వహించారు. అయితే, శిక్షణ కార్యక్రమానికి పలువురు బీఎల్వోలు హాజరు కాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BLO Absence Issue | ఎన్నికల సంఘం నిర్ధేశించినప్పటికీ..
ఎన్నికల సంఘం నిర్దేశించిన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు కావడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. గైర్హాజరైన బీఎల్వోలకు (government officials) షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠినచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే (telangana news) ఎస్ఐఆర్(SIR) మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని, బీఎల్వోలు శిక్షణకు గైర్హాజరు అయితే మీరేం చేస్తున్నారంటూ సూపర్వైజర్లపై అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు కూడా (voter list revision) వెనుకాడేది లేదని బీఎల్వోలుగా వ్యవహరిస్తున్న మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బంది, వార్డు ఆఫీసర్లను హెచ్చరించారు.
BLO Absence Issue | విధులపై దిశానిర్దేశం
కాగా.. బీఎల్వోలు నిర్వర్తించాల్సిన విధులు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ నిర్వహణలో తీసుకోవాల్సిన (election updates) జాగ్రత్తలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఇతర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు జ్ఞానేశ్వర్, సంతోష్ కుమార్ అవగాహన కల్పించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా (nizamabad news) ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సౌత్, నార్త్ తహశీల్దార్లు శ్రీధర్, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్

