అక్షరటుడే, వెబ్డెస్క్ : BMW Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు టైర్ ఊడిపోయింది.
ఫిలిం నగర్ (Film Nagar)లో సోమవారం ఉదయం అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పింది. అనంతరం డివైడర్ను ఢీకొంది. కారు ముందుటైర్ ఊడిపోయిందంటే ఎంత వేగంగా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే కారులో ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో డ్రైవర్ స్వల్పగాయాలతో బయట పడ్డాడు. కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డుపై ఉన్న కారును పక్కకు తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. కారును నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
BMW Car Accident | దూసుకెళ్తున్నారు
రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరిగాయి. ముఖ్యంగా కార్లు ఢీకొని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కారులను అతివేగంగా నడపడం, మద్యం మత్తులో దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్న వారు అతివేగంగా వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర వాహనాదారులను వీరు ఢీకొంటున్నారు. ఈ లగ్జరీ కార్లలో సేఫ్టీ ఫీచర్లు ఉండటంతో అందులోని వారు ప్రాణాలతో బయట పడుతున్నారు. అయితే వీరు చేసే పొరపాట్లకు సామాన్య ప్రజలు చనిపోతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ

