Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయాల పెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయాల పెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

నిజామాబాద్

Bodhan Government Hospital | బోధన్ ఆస్పత్రిలో సదుపాయాల పెరుగుదలకు కృషి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయల మెరుగుదలకు కృషి చేస్తామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 24, 2026 5:48 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Bodhan Government Hospital

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Bodhan Government Hospital | బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో సదుపాయాల పెరుగుదలకు కృషి చేస్తామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని (Collector Ila Tripathi) మంగళవారం సందర్శించారు.

Contents
  • Bodhan Government Hospital | అవుట్​ పేషెంట్​ బ్లాక్​..
    • Bodhan Government Hospital | రోగులకు మెరుగైన సేవలు అందించాలి..

Bodhan Government Hospital | అవుట్​ పేషెంట్​ బ్లాక్​..

ఆస్పత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఇతర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను కలెక్టర్​ పరిశీలించారు. ఆస్పత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త శ్రీనివాస్ ప్రసాద్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్​తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆస్పత్రికి ఎంతమంది రోగులు సందర్శిస్తున్నారు. ఎక్కువగా ఎలాంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం వస్తున్నారనే విషయాన్ని ఆరా తీశారు. ఆస్పత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒకే గైనకాలజిస్టు సేవలు అందుబాటులో ఉన్నందున మరో గైనకాలజిస్టును నియమించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రిలో ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలకు సైతం చొరవ చూపుతానన్నారు.

Bodhan Government Hospital | రోగులకు మెరుగైన సేవలు అందించాలి..

రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అవుట్ పేషంట్ (Outpatient) రోగులకు అందిస్తున్న సేవలను మరింతగా పెంపొందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రస్తుత వేసవి సీజన్​లో ఫుడ్ పాయిజనింగ్, డీహైడ్రేషన్ వంటి కేసులు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యులు, సిబ్బందిని సమకూరుస్తామని, అయినా కూడా వైద్య సేవల్లో లోపాలు ఉంటే ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటానన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని రకాల ఆరోగ్య సేవలను స్థానికంగానే అందించాలని, అత్యవసరం అయితేనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రి (Nizamabad District General Hospital)కి రిఫర్ చేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: School Early Admissions | ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నవిద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Mala Sangham elections | మాల సంఘం కార్యవర్గం ఎన్నిక
POCSO Case | పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు..
Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Pending Works Completion | పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలి: ఎమ్మెల్యే మదన్​మోహన్​
TAGGED:Bodhan Government HospitalCollector Ila Tripathidistrict collector visithealthcare improvementhospital facilities Indiamedical infrastructureNizamabad District General HospitalNizamabad NewsOutpatientpublic health servicesTelangana hospitals
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Stock Market Surge Stock Market Surge | తగ్గుతున్న ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన సూచీలు
Next Article Fake Dentist Arrest Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?