అక్షరటుడే, వెబ్‌డెస్క్: Boyinapalli Market Issues | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని బోయిన్పల్లి మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మార్కెట్‌ను పరిశీలించి, ప్రజలు, రైతులు, కార్మికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నాను.
బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ (Boinpally Market Yard) ఇక్కడ ఉండబట్టి 24 ఏళ్ళు అవుతుందని ఎంపీ ఈటల అన్నారు. మార్కెట్‌కు రోజు 10 వేల మంది వినియోగదారులు వస్తారన్నారు. ఏడాదికి రూ.14 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నారు. రూ.కోట్ల ఆదాయం వస్తున్నా.. ప్రభుత్వం మార్కెట్‌ను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలలుగా చెత్త తీసే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. దీంతో వందల లారీల చెత్త పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Boyinapalli Market Issues | డంప్యార్డులా మారింది
ఇది కూరగాయల మార్కెట్ లాగా లేదని, డంప్ యార్డ్ లాగా ఉందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ టాయిలెట్‌కు వెళ్లాలంటే ఇంకో మహిళ కాపలా కాయల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూత్రశాలలకు నీళ్లు, డోర్లు లేవు అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్నారు. చెత్తను మోసేవారు లేకపోవడంతో పేరుకుపోయి దుర్గంధం వస్తోందన్నారు.

Boyinapalli Market Issues | చెత్త తీసేయాలి
మార్కెట్లో ఉన్న చెత్తంతా తీసేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (Underground Drainage) క్లీన్ చేయించాలన్నారు. శాశ్వతంగా అండర్ గ్రౌండ్ వ్యవస్థ పని చేసేంతవరకు, మంచినీళ్లు వ్యవస్థ మెరుగుపరిచే వరకు తన ధర్నా కొనసాగుతుందన్నారు. సమస్యలు మొత్తం పరిష్కారం అయ్యేంతవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. అవసరమైతే మార్కెట్ యార్డ్‌ను రెండు రోజులు బందు పెట్టి మొత్తం శుభ్రం చేయాలన్నారు.
Boyinapalli Market Issues | కమీషన్ అడుగుతున్నారు
యార్డ్‌ను శుభ్రం చేసే కాంట్రాక్టర్లకు, టాయిలెట్స్ కడిగే కాంట్రాక్టర్లకు, చెత్తను తీసే కాంట్రాక్టర్లకు నెలకు రూ.7 లక్షల ఇవ్వలేక 9 నెలలు అవుతుందన్నారు. కాంట్రాక్టర్ వెళితే 10 శాతం కమీషన్ ఇస్తేనే సంతకం పెడతా అని చెబుతున్నారంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఈ సమస్య పరిష్కరించకపోతే వేలాది మంది కార్మికులతో ధర్నా కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: IPL Betting Warning | బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. యువతకు సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

