అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Breath Analyzers Distribution | జాతీయ రహదారి 44పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు (Drunk Driving Tests) చేయడానికి.. సేవ్ లైఫ్ ఫౌండేషన్ 10 బ్రీత్ ఎనలైజర్లను అందజేసిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
Breath Analyzers Distribution | సేవ్ లైవ్ ఫౌండేషన్ సహాయంతో
వెర్టీస్ ఫౌండేషన్ సహకారం, ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ (Save LIFE Foundation) సహాయంతో మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బ్రీత్ ఎనలైజర్స్ అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను (Road Accidents) తగ్గించడం, రహదారి భద్రతను పటిష్టం చేయడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ – నిజామాబాద్ మధ్య గల ఎన్హెచ్-44 రహదారిపై ప్రమాదాల నివారణకు ఈ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

Breath Analyzers Distribution | బ్రీత్ ఎనలైజర్స్ ద్వారా
బ్రీత్ ఎనలైజర్స్ (Breath Analyzers) ద్వారా వాహనాదారును తనిఖీలు నిర్వహించడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్యను నివారించవచ్చన్నారు. రహదారులపై మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి (Additional DCP Baswareddy), సేవ్ లైఫ్ ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ నూర్ కేతర్పాల్, ఈ-డార్ మేనేజర్ శ్రీ వర్ష, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ విభాగం వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య

