అక్షరటుడే, బాన్సువాడ: BRS Leaders Arrest | హామీల అమలు కోసం శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడి చేపట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం తగదని బాన్సువాడ (Banswada) మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెల్లవారుజామున పోలీసులు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
BRS Leaders Arrest | విద్యానిధులు..ఉద్యోగాలు ఏవి.. ?
బీఆర్ఎస్వీ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా, ఫిరోజ్, ఖలీల్, యువజన నాయకుడు రమేష్ యాదవ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 15 శాతం విద్యా నిధులు, 2 లక్షల ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్‌లు, చదువుకుంటున్న విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించిందన్నారు. పోలీసులను ఉపయోగించి విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని రేవంత్ సర్కారు (CM Revanth Reddy) కుట్ర పన్నుతోందని ఆరోపించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఉద్యమం ఆగదని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Municipal Workers Protest | అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులపై చర్చ జరగాలి

