అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS Leaders Meeting | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో పార్టీ నేతలు భేటీ అయ్యారు. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం కొత్వాల్‌గూడలోని క్వారీ వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కుమారుడికి చెందిన రాఘవ కన్స్టక్షన్ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో సైతం నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆదివారం మైనింగ్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా నేతలు సమావేశం అయ్యారు.
BRS Leaders Meeting | గవర్నర్‌కు ఫిర్యాదు
కేటీఆర్ (KTR) నివాసం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లికి బయలుదేరింది. వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూ కబ్జాలను పరిశీలించి బాధితులతో కేటీఆర్, ఎమ్మెల్యేలు మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి శ్రీనివాస రెడ్డి అక్రమాలపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla)ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివేదిక ఇవ్వనున్నారు.

BRS Leaders Meeting | బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్
అక్రమ మైనింగ్ (Illegal Mining)కు పాల్పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, రాఘవ కనస్ట్రక్షన్స్ (Raghava Constructions) అక్రమాలపై హౌస్ కమిటీ, హైకోర్ట్ సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. గన్ పార్కు నుంచి శాసన మండలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండలిలో సైతం బీఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో మండలి ఛైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి..: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన..
