అక్షరటుడే, ఇందూరు: BRS Minority Support | మైనారిటీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) అన్నారు. జిల్లా కేంద్రంలోని అలుహమ్రాఫ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
BRS Minority Support | కులమతాలకు అతీతంగా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో (BRS government schemes) కులమతాలకతీతంగా అన్ని పండుగలు నిర్వహించకున్నామని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. షాదీ ముబారక్ ద్వారా చెక్కులతోపాటు తన సొంత డబ్బులతో ఆడపడుచులకు పట్టుచీర అందించడం జరిగిందన్నారు. మైనారిటీ కాలనీలలో (Nizamabad political news) సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ (Telangana BRS party) ప్రభుత్వందేనిని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మైనారిటీలకు (minority welfare schemes) అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షెహజాద్, మహమ్మద్ మతిన్, అబ్దుల్ భారీ, సనావుల్లా ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ సమీ, అబ్దుల్ అజీజ్, మజార్ ఉద్దీన్, మహమ్మద్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత

