Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​

తెలంగాణతాజా వార్తలు

BRS Municipal Victory | క్యాతన్​పల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్​ఎస్​

క్యాతన్​పల్లి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా బీఆర్​ఎస్​ అభ్యర్థి సంధ్యారాణి, ఇబ్రహీంపట్నం బల్దియా ఛైర్మన్​గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 4, 2026 1:25 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
BRS Municipal Victory

అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS Municipal Victory | రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన క్యాతన్​పల్లి మున్సిపల్ పీఠాన్ని ఎట్టకేలకే బీఆర్​ఎస్​ (BRS) కైవసం చేసుకుంది. సీపీఐ (CPI)తో కలిసి చైర్​పర్సన్​ పదవి దక్కించుకుంది.

Contents
  • BRS Municipal Victory | హాజరుకాని కాంగ్రెస్​
    • BRS Municipal Victory | ఇబ్రహీంపట్నంలో సైతం..

రాష్ట్రంలో మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఎన్నికలను ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే హంగ్​ ఏర్పడిన కొన్ని బల్దియాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకుల వాగ్వాదం, ఘర్షణ, కోరం లేకపోవడం వంటి కారణాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా (Mancherial District) క్యాతనపల్లిలో సైతం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రెండు సార్లు ఎన్నిక వాయిదా పడగా.. తాజాగా అధికారులు ఛైర్​పర్సన్​ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

BRS Municipal Victory | హాజరుకాని కాంగ్రెస్​

క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్​ ఛైర్​పర్సన్​ ఎన్నికను శనివారం అధికారులు నిర్వహించారు. ఈ క్రమంలో క్యాత‌న్‌ప‌ల్లి మున్సిప‌ల్ ఛైర్​పర్సన్​గా గొడిస‌ల సంధ్యారాణి (బీఆర్ఎస్),వైస్ ఛైర్​పర్సన్​గా మిట్ట‌ప‌ల్లి స‌రిత‌ (సీపీఐ) ఎన్నికయయ్యారు. బల్దియాలో బీఆర్​ఎస్​ 10 స్థానాల్లో, సీపీఐ 4 చోట్ల విజయం సాధించాయి. కాంగ్రెస్-7, ఇండిపెండెంట్ ఒక్క చోట గెలవగా.. ఇద్దరు ఎక్స్ అఫిషియో, ఇండిపెండెంట్ కలిసి కాంగ్రెస్ బలం 10కి చేరింది. అయితే ఎలాగైన మున్సిపాలిటీని దక్కించుకోవాలని కాంగ్రెస్​ యత్నించింది. మంత్రి వివేక్​ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్​ఎస్​ పకడ్బందీగా వ్యవహరించింది. దీంతో బీఆర్​ఎస్​ పీఠాన్ని దక్కించుకుంది. ఎన్నికకు కాంగ్రెస్​ సభ్యులు హాజరు కాలేదు. క్యాత‌న్‌ప‌ల్లి మున్సిప‌ల్ ఛైర్​పర్సన్​గా గొడిస‌ల సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ ఛైర్​పర్సన్​గా మిట్ట‌ప‌ల్లి స‌రిత‌ (సీపీఐ) ఎన్నికయ్యారు.

BRS Municipal Victory | ఇబ్రహీంపట్నంలో సైతం..

రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్​గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు. గతంలో ఇక్కడ ఎన్నిక నిర్వహించారు. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మరోసారి ఎన్నికలు నిర్వహించగా.. బీఆర్​ఎస్​ బల్దియా పీఠాన్ని గెలుచుకుంది. వైస్​ఛైర్​పర్సన్​గా బీజేపీకి చెందిన ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. కాగా ఎన్నిక వాయిదా వేయాలని కాంగ్రెస్​ కౌన్సిలర్లు కోరారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Drunk Driving WhatsApp Group | మందుబాబుల మాస్టర్​ ప్లాన్​.. షాకిచ్చిన ఎస్సై

Iran US Tensions | జెనీవా చర్చలు విఫలం.. ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు యథాతథం!
Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
Kavitha Arrest Narsingi | నార్సింగ్​లో ఉద్రిక్తత.. కల్వకుంట కవిత అరెస్టు!
Mar 06 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Banana Peel | అరటి తొక్క.. మంచు కంటే ప్రమాదమట.. ఎందుకంటే!
TAGGED:BRS Municipal VictoryBRS Partyibrahimpatnam newskathanpally newsMunicipal ElectionsRanga Reddy districtTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article IRCTC boarding change IRCTC boarding change | రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక అరగంట ముందూ స్టేషన్ మార్చుకోవచ్చు
Next Article Hormuz LPG tanker Hormuz LPG tanker | హార్మూజ్ దాటిన మరో నౌక.. 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో వస్తున్న ‘గ్రీన్ సాన్వి’
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?