Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BRS name change | మళ్లీ టీఆర్​ఎస్​గా బీఆర్​ఎస్​.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BRS name change | మళ్లీ టీఆర్​ఎస్​గా బీఆర్​ఎస్​.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ

BRS name change | మళ్లీ టీఆర్​ఎస్​గా బీఆర్​ఎస్​.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

బీఆర్​ఎస్​ పేరును మళ్లీ టీఆర్​ఎస్​గా మార్చేందుకు యత్నిస్తున్నట్లు కేటీఆర్​ తెలిపారు. ప్రజాసమస్యలపై 2027లో పాదయాత్ర మొదలు పెడతానని చెప్పారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 6:37 సా.
Srinivas Kolluri
21 గంటలు ago
Share
BRS name change

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: BRS name change | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ పేరును మళ్లీ టీఆర్​ఎస్​గా మార్చేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు.

Contents
  • BRS name change | పాదయాత్ర చేస్తా
    • BRS name change | ఎవరైనా పార్టీ పెట్టొచ్చు

టీఆర్​ఎస్​ పేరును గతంలో బీఆర్​ఎస్​గా మార్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో దేశంలో చక్రం తిప్పుతామని పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయితే ఆ నిర్ణయానికి జన ఆమోదం లభించలేదు. అనేక కారణాలతో పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అందులో పార్టీ పేరు మార్పు, దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి అనుకోవడం కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్​ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్‌ (TRS)గానే ఉండాలని ప్రజలు కోరుకునేది నిజమే అన్నారు. కానీ బాస్‌ ఏది చెబితే అదే తమకు ఫైనల్​ అని చెప్పారు. పార్టీ పేరు BRSగా మారాక నష్టపోయామని ఒప్పుకున్నారు.

BRS name change | పాదయాత్ర చేస్తా

తమకు పొత్తులు కలిసి రావని కేటీఆర్​ అన్నారు. వచ్చే ఎన్నికిల్లో బీజేపీ (BJP)తో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. ప్రజాసమస్యలపై 2027లో పాదయాత్ర మొదలు పెడతానని తెలిపారు. తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. పార్టీ, ప్రజల మధ్య గ్యాప్ వల్లే ఓడిపోయామని అంగీకరించారు.

BRS name change | ఎవరైనా పార్టీ పెట్టొచ్చు

కవిత (Kavitha) కొత్త పార్టీపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిదన్నారు. కానీ ఆ పార్టీలకు ఓట్లు వేయాలి కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ​మన బాధే జనం బాధ అనుకుంటే ప్రజలు నమ్మరని కేటీఆర్​ అన్నారు. తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ ఏడిపించవద్దంటూ కామెంట్స్​ చేశారు.

ఇది కూడా చదవండి : Inter Supplementary Exams | మే 13 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Annaram Barrage Controversy | అన్నారం బ్యారేజీ కూల్చేందుకు కుట్ర.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Isnapur Councillor Disqualified | ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌ మాధవిపై వేటు!
Rice Export Scam | బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్​ : హరీశ్​రావు
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:BRSelectionsIndian PoliticsKTRparty name changeTelangana PoliticsTRS
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kakatiya Nizamabad Kakatiya Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం.. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం
Next Article Student Drowning Kamareddy | Student Drowning Kamareddy | కామారెడ్డిలో విషాదం.. ఈతకు వెళ్లి విద్యార్థి దుర్మరణం..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?