Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?

తెలంగాణతాజా వార్తలు

BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?

గతేడాది గ్రాండ్‌గా రజతోత్సవాలు నిర్వహించిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం ఆవిర్భావ దినోత్సవాన్ని సింపుల్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 9, 2026 10:42 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
BRS Plenary Plan

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS Plenary Plan | భార‌త రాష్ట్ర స‌మితి (Bharat Rashtra Samithi) తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక దశకు చేరుకుంది. 2001 ఏప్రిల్‌లో ఆవిర్భవించిన ఈ పార్టీ ఉద్యమ దశ నుంచి అధికారంలోకి వచ్చి, ప్రస్తుతం ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 26వ ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Contents
  • BRS Plenary Plan | కొత్త కమిటీలపై దృష్టి
    • BRS Plenary Plan | కొత్త కమిటీల నియామకం

గతేడాది వరంగల్‌ (Warangal)లో రజతోత్సవాలను అట్టహాసంగా నిర్వహించిన బీఆర్ఎస్, ఈసారి మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగ సభల రూపంలో కాకుండా, కేవలం ప్రతినిధుల సభగా ప్లీనరీని నిర్వహించాలని భావిస్తున్నారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.

BRS Plenary Plan | కొత్త కమిటీలపై దృష్టి

పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి (Party Foundation Day) ముందే జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కమిటీలపై కసరత్తు పూర్తి అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను పక్కన పెట్టి, ప్రధానంగా జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతోనే ప్లీనరీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌విత (Kalvakuntla Kavitha) ఈ నెల 25న తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్న ఆమె, పార్టీ ప్రకటన సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అనే ఆసక్తి నెలకొంది.

BRS Plenary Plan | కొత్త కమిటీల నియామకం

ఆమె వ్యాఖ్యలకు వెంటనే స్పందిస్తే అనవసర ప్రచారం కలిగే అవకాశం ఉందని, స్పందించకపోతే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి హడావుడి లేకుండా ప్లీనరీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో పార్టీ పునర్‌వ్యవస్థీకరణ, కొత్త కమిటీల నియామకం కీలకంగా మారింది. ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

 

Revive Plants Tips | మొక్కలు వాడిపోతున్నాయా.. ఈ చిట్కాలతో పచ్చగా మార్చండిలా!
Fuel Shortage India | ఇంధన యుద్ధం.. దేశంలో పెట్రోల్​–డీజిల్​ కొరత.. బంకుల్లో వాహనదారుల బారులు!
Kakbhushundi Time Travel | విశ్వ యాత్రికుడు కాకభుశుండి మహర్షి.. అనేక రామాయణాలకు సాక్షి
LPG Booking Rules | సిలిండర్‌ బుకింగ్‌ రూల్స్‌ మరింత కఠినతరం!
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TAGGED:Bharat Rashtra SamithiBRS Plenary PlanKalvakuntla KavithaKCRParty Foundation DayWarangal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hormuz Strait Hormuz Strait | హర్ముజ్​ను మళ్లీ మూసివేసిన ఇరాన్.. వార్నింగ్​ ఇచ్చిన ట్రంప్​
Next Article Assembly Elections Polling Assembly Elections Polling | మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?