Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bumrah Wicketless Streak | యార్కర్ కింగ్ బుమ్రాకు ఏమైంది?.. వరుస మ్యాచ్‌ల్లో ద‌క్క‌ని వికెట్‌, ఫ్యాన్స్‌లో ఆందోళన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Bumrah Wicketless Streak | యార్కర్ కింగ్ బుమ్రాకు ఏమైంది?.. వరుస మ్యాచ్‌ల్లో ద‌క్క‌ని వికెట్‌, ఫ్యాన్స్‌లో ఆందోళన

క్రీడలు

Bumrah Wicketless Streak | యార్కర్ కింగ్ బుమ్రాకు ఏమైంది?.. వరుస మ్యాచ్‌ల్లో ద‌క్క‌ని వికెట్‌, ఫ్యాన్స్‌లో ఆందోళన

ఐపీఎల్ 2026లో జస్రీత్ బుమ్రా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో వికెట్ తీసుకోక‌పోవ‌డం చర్చనీయాంశమైంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 9:58 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Bumrah Wicketless Streak

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bumrah Wicketless Streak | క్రికెట్ ప్రపంచంలో యార్కర్ కింగ్‌గా పేరు గాంచిన జస్రీత్ బుమ్రా ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. బ్యాటర్లను తన యార్కర్లతో ఇబ్బంది పెట్టే బుమ్రా, ఈసారి మాత్రం ఐపీఎల్ 2026 (IPL 2026)లో వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత ఐదు మ్యాచ్‌లుగా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Contents
  • Bumrah Wicketless Streak | ఫామ్ కోల్పోయిన బుమ్రా..
    • Bumrah Wicketless Streak | భారత జట్టుకు కూడా కీలక బౌలర్

తాజాగా ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరు బ్యాటర్లు భారీగా విరుచుకుపడి 240 పరుగుల భారీ స్కోర్ నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి, జట్టులో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ, వికెట్ మాత్రం దక్కలేదు.

Bumrah Wicketless Streak | ఫామ్ కోల్పోయిన బుమ్రా..

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ బుమ్రా వికెట్ తీసుకోలేకపోయాడు.అంతేకాకుండా ఐపీఎల్ 2025 చివర్లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ నుంచే ఆయన ఫామ్ తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి వికెట్ దక్కించుకోలేక‌పోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 19 ఓవర్లు (114 బంతులు) వేసి 163 పరుగులు ఇచ్చినా, ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. ఆయన ఎకానమీ రేటు 8.5గా ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు అతను వికెట్లు తీయలేకపోవడంతో జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది.

Bumrah Wicketless Streak | భారత జట్టుకు కూడా కీలక బౌలర్

సాధారణంగా బుమ్రా బౌలింగ్‌కి బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతుంటారు. దీంతో ఇతర బౌలర్లకు వికెట్లు దక్కేవి. కానీ ప్రస్తుత పరిస్థితిలో బుమ్రా మీద భయం తగ్గిపోవడం ప్రత్యర్థి జట్లకు అనుకూలంగా మారింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యువ ఆటగాళ్లు కూడా బుమ్రాపై ధైర్యంగా ఆడుతున్నారు. కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు బాదడం ఆయన ప్రస్తుత ఫామ్‌ను సూచిస్తోంది. బుమ్రా కేవలం ముంబై ఇండియన్స్‌కే  కాదు, భారత జట్టుకు కూడా కీలక బౌలర్. ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో ఆయన ఫామ్‌పై ఆందోళన మరింత పెరిగింది. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా తన పాత రిథమ్‌ను తిరిగి అందుకుని, తన ప్రత్యేక యార్కర్లతో వికెట్లు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు బుమ్రాపైనే ఉంది. ఆయన తిరిగి తన ఫామ్‌లోకి వస్తాడా? మళ్లీ ప్రత్యర్థులను భయపెట్టే యార్కర్ కింగ్‌గా నిలుస్తాడా? అన్నది చూడాలి.

ఇది కూడా చదవండి..: IPL 2026 Gloves Issue | చెన్నై తొలి విజయం.. హాట్ టాపిక్​గా మారిన స్టబ్స్ గ్లోవ్స్ వివాదం

 

India vs England Semi | సెమీస్‌లో భారత జట్టు భారీ స్కోర్… ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యం
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల
RCB Sale Deal | ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద డీల్.. భారీ ధరకు దక్కించుకున్న బిర్లా-టైమ్స్‌‌‌‌ గ్రూప్
Saketh Myneni Deputy Collector | టెన్నిస్ స్టార్‌కి డిప్యూటీ కలెక్టర్ పదవి.. క్రికెటర్ శ్రీచరణికి నజరానా
TAGGED:Bumrah Wicketless StreakIPL 2026Mumbai IndiansPunjab KingsRoyal Challengers BangaloreVaibhav Suryavanshi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gold on Wheels Vizag Gold on Wheels Vizag | విశాఖలో ‘గోల్డ్ ఆన్ వీల్స్’ సంచలనం.. తోపుడు బండిపై బంగారం అమ్మకాలు, జనంలో ఆసక్తి
Next Article RTC JAC Strike Talks RTC JAC Strike Talks | నేడు లేబర్​ కమిషనర్​తో ఆర్టీసీ జేఏసీ చర్చలు.. విఫలమైతే సమ్మెకు వెళ్లే యోచన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?