అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cancer Notifiable Disease | క్యాన్సర్‌పై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఇటీవల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. దీంతో సమగ్ర పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది. దీంతో ఇప్పటివరకు కొన్ని సంస్థలకే పరిమితమైన క్యాన్సర్ రిజిస్ట్రీ వ్యవస్థను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించింది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులన్నీ క్యాన్సర్ కేసులను తప్పనిసరిగా నమోదు చేయాలి. కేసు నిర్ధారణ జరిగిన తేదీ నుంచి నెలలోపు సంబంధిత వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.
Cancer Notifiable Disease | పూర్తిస్థాయి సమాచారం కోసం..
పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్స్‌తో (Radiology Labs) పాటు ఇన్సూరెన్స్ సంస్థలు, ఎన్‌జీవోలు కూడా ఈ డేటా సేకరణ ప్రక్రియలో భాగస్వాములు కానున్నాయి. క్యాన్సర్‌పై పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి తీసుకురావడం క ఓసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) పర్యవేక్షణలో ప్రతి ఆస్పత్రిలో ప్రత్యేక క్యాన్సర్ రిజిస్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీనిని కూడా చదవండి : Tulam Gold Scheme | తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే తులం బంగారం!
