Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!

జాతీయంతాజా వార్తలు

CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!

CAPF బిల్లు 2026 ను కేంద్ర బలగాల నిర్మాణాన్ని సమూలంగా మార్చే కీలక సంస్కరణగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో సదరు బిల్లుపై జరిగే చర్చలు, ఆమోద ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Naresh chandan
Last updated: మార్చి 21, 2026 9:29 సా.
Naresh chandan
5 రోజులు ago
Share
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!
CAPF Bill 2026 | కేంద్ర బలగాల మార్పునకు శ్రీకారం.. CAPF బిల్ 2026 రూపకల్పన!

అక్షరటుడే, న్యూఢిల్లీ: CAPF Bill 2026 | కేంద్ర బలగాల్లో మార్పునకు కేంద్రం శ్రీకారం చుడుతోంది. ఈమేరకు కేంద్ర హోం శాఖ మంత్రి Amit Shah సోమవారం పార్లమెంట్‌లో CAPF బిల్ 2026ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

Contents
  • CAPF Bill 2026 | కీలక మార్పులు..
    • CAPF Bill 2026 | ఈ బిల్ ముఖ్యం ఎందుకంటే..
      • రాజకీయ వాతావరణం
      • ఈ బిల్ అమల్లోకి వస్తే:

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (CAPF) భారీ మొత్తంలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యంగా కేంద్రం చెబుతోంది. ఈ బిల్లులోని సంస్కరణలు అమల్లోకి వస్తే.. ఆయా దళాల్లో పదోన్నతులు, కెరీర్ పురోగతి, సేవా నియమాల వంటి అంశాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.

CAPF Bill 2026 | కీలక మార్పులు..

ఉన్నత స్థాయి పదవుల పెంపు: అదనంగా 33 ADG స్థాయి పోస్టులు సృష్టించే ప్రతిపాదన ఈ బిల్లులో పొందుపర్చినట్లు సమాచారం.

ప్రమోషన్ వ్యవస్థలో మార్పులు: ఉద్యోగుల ఎదుగుదలకు అనుకూలంగా ప్రమోషన్ పిరమిడ్ పునర్వ్యవస్థీకరించినట్లు చెబుతున్నారు.

వేగవంతమైన క్యాడర్ సమీక్షలు: కాలానుగుణంగా త్వరితగతిన సమీక్షలు చేపట్టడం ప్రధాన ఉద్దేశం.

స్పష్టమైన సేవా నియమాలు: ఉద్యోగుల బాధ్యతలు,  హక్కులపై కోడ్ రూపంలో నిబంధనలు

CAPF Bill 2026 | ఈ బిల్ ముఖ్యం ఎందుకంటే..

కేంద్ర బలగాల్లో గత కొంత కాలంగా పెండింగులో ఉన్న పదోన్నతుల సమస్య, కెరీర్ స్టాగ్నేషన్ (stagnation) వంటి అంశాలను పరిష్కరించడంలో ఈ బిల్లు కీలకంగా మారనుందని భావిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఫలితంగా కొంతవరకు మార్పులు వచ్చినప్పటికీ, పూర్తి స్థాయిలో పరిష్కారం కోసం ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్రం చెబుతోంది.

రాజకీయ వాతావరణం

కాగా, సదరు బిల్లుపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కానీ, ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా చెబుతోంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సంస్కరణలుగా, కేంద్ర దళాల సామర్థ్యాన్ని పెంచే దిశగా ఇది ఒక పెద్ద అడుగుగా వర్ణిస్తోంది.

ఈ బిల్ అమల్లోకి వస్తే:

  • సిబ్బందిలో ఉత్సాహం పెరుగుతుంది.
  • కెరీర్‌లో స్పష్టత వస్తుంది.
  • సేవా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.
  • సంస్థాగత సామర్థ్యం మెరుగుపడుతుంది.

ఇది కూడా చదవండి: Global Crisis Warning | ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది : రక్షణ మంత్రి రాజ్​నాథ్​

LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
Maharashtra Factory Explosion | మహారాష్ట్రలో భారీ పేలుడు.. 17 మంది మృతి
Gold Silver Prices | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు
KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Farooq Abdullah Attack | ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. జెడ్ ప్లస్ భద్రతతో త్రుటిలో తప్పిన ప్రమాదం
TAGGED:Amit ShahCAPF Bill 2026central forcesgovernance reformIndian Parliamentpromotions reformsecurity forcesservice rules
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Cyber fraud Hyderabad Cyber fraud Hyderabad | మాజీ డీజీపీ మనవరాలికి సైబర్​ నేరగాళ్ల టోకరా
Next Article UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి! UAE India Missile Deal | భారత రక్షణ రంగంలో కీలక పరిణామం.. బ్రహ్మోస్​, ఆకాశ్​ కొనుగోలుకు యూఏఈ ఆసక్తి!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?