అక్షరటుడే, ఆర్మూర్: Car Accident | కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆలూర్ మండలం (Alur Mandal) గుత్ప గ్రామ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Car Accident | గుత్ప సమీపంలో..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్ప గ్రామ (Guthpa village) సమీపంలో రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న పెద్ద బైరి నారాయణ (31) ప్రమాద తీవ్రతకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో యువకుడు క్యాసెల్ ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న గుత్ప సర్పంచ్ దశరథ్ (Gutpa Sarpanch Dasharath), ఉపసర్పంచ్ చిన్న రెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసుల సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన ప్రవీణ్‌ను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి (Nizamabad Government Hospital)కి తరలించారు. నారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి..: Shabbir Ali Comments | కేసీఆర్ ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నాం..: షబ్బీర్ అలీ

